HomeHealthLittle millet in telugu : సామలతో ఆరోగ్య ప్రయోజనాలు

Little millet in telugu : సామలతో ఆరోగ్య ప్రయోజనాలు

Little millet in telugu :

లిటిల్ మిల్లెట్ ని తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో సామ లేదా సామలు ( little millet in telugu ) అని పిలుస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చిరు ధాన్యాలు తెలియని వారు ఎవరు లేరు ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత చాలా మంది వీటిని తినడం మొదలు పెట్టారు. వీటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఏ వ్యాధితో అయిన పోరాడటానికి ఎంతో తోడ్పడతాయి అని డాక్టర్స్ అందరూ సూచిస్తున్నారు.

సామలు మొదటగా ఏ ప్రాంతంలో గుర్తించారో ఇప్పటికి ఎవరికి సరిగా తెలియదు. కానీ కొంత మంది శాస్త్రవేత్తలు ఈ సామలు భారత దేశానికి చెందిన పంట అని వీటిని మొదటగా భారత దేశములో పండిచేవారని చెప్తున్నారు. ఈ సామలు భారత దేశంతో పాటుగా ఎక్కువగా కాకసస్, ఆసియా , చైనా, మరియు మలేషియా , శ్రీలంక లాంటి దేశాల్లో సాగు చేస్తున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది.

ఈ సామలు ఎలాంటి వాతావరణాన్ని అయిన ఎదుర్కొని పంట దిగుబడి ఇచ్చేదిగా పేరు పొందింది. సామలు పోయేసి కుటుంబానికి చెందినవిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని శాస్త్రీయ నామం పాణికం సుమత్రేన్స్ గ పిలుస్తారు. సాధారణంగా అన్ని చిరు ధాన్యాలు పోషక విలువలకు ప్రతీకగా చెప్తారు. సామలు కూడా మానవ శరీరానికి కావల్సిన పోషకాలను అందచెస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు.

సామలని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. తెలుగు లో సామలు ( little millet in telugu ) అని పిలుస్తారు. సామలను హిందీలో కుట్కి లేదా శావన్ ( little millet in Hindi ) అని, మలయాళంలో చామ ( little millet in Malayalam ) అని , తమిళంలో సామై ( little millet in Tamil ) అని, పంజాబీలో స్వంక్ ( little millet in Panjabi ) అని , కన్నడలో సామె లేదా శావె ( little millet in kannada ) అని , మరాఠీ లో సవా లేదా హల్వ లేదా వరి అని ( little millet in Maraati ) , గుజరాతీ లో గజ్రో లేదా కురి అని ( little millet in gujarati ) , ఒరియాలో సువన్ అని ( little millet in Oriya ) బెంగాలీ లో సమ అని ( littile millet in Bengali )పిలుస్తారు.

సామలలో పోషక విలువలు : Neutrients values in little millet in telugu

ఒక వంద గ్రాముల సామలలో ఫైబర్ 7.9 గ్రాములు, ప్రోటీన్స్ 7.5 గ్రాములు, ఫ్యాట్ 4.2 గ్రాములు, విటమిన్ A మినరల్స్ 1.6గ్రాములు, ఐరన్ 1.25 గ్రాములు, నైసిన్ 1.27 గ్రాములు, మెగ్నీషియం 114 మిల్లీ గ్రాములు, కాల్షియం 18మిల్లీ గ్రాములు, ఎనర్జీ 329 kcal , కార్బోహైడ్రేట్లు 61.7 గ్రాముల పోషకాలు లభిస్తాయి.

సామల వల్ల కలిగే ఉపయోగాలు ( benifits of littile millet in telugu ):

1.సామలు గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఎందుకంటే సామలలో మెగ్నీషియం ఉంటుంది.అది గుండె సరిగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.

2.సామలు బరువు తగ్గాలని అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుందని న్యూట్రీషిన్లు సూచిస్తున్నారు. ఇందులో ఉండే సియానిన్ శరీరంలోని కొవ్వును కరగించడానికి ఉపయోగపడుతుంది.

3.సామలు గాయాలు అయిన వారికి బాగా ఉపయోగపడుతాయి. సామలలో అధిక శాతం ఫాస్పరస్ ఉంటుంది. ఇది టిష్యూ రిపేర్ చేయటానికి మరియు శరీరాన్ని డిటాక్స్ చేయటానికి ఉపయోగపడుతుంది.

4.శరీరంలో అధిగా వేడితో బాధపడేవారు సామలను తీసుకోవడం వలన ఉపశమనం పొందవచ్చు. సామలు మన శరీరంలో వేడి ని తగ్గిస్తుంది.

5.సామలు మధుమహాన్ని అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES