HomeHealthjajikaya : జాజికాయ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

jajikaya : జాజికాయ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Jajikaya :

జాజికాయ ( jajikaya ) అంటే మన తెలుగు రాష్ట్రాల్లో బహుశా తెలియని వారు ఉండరేమో ? ఎందుకంటే జాజికాయ ని మనం ఎక్కువగా వంటకాల్లో తరుచూ వాడుతుంటాం. జాజికాయ ని ( nutmeg ) ఎక్కువగా మాంసాహార వంటకాల్లో మసాలా దినుసు గా వాడుతాం. బిర్యానీ వంటకాల్లో జాజికాయ ని ఫ్లేవర్ కోసం వాడుతారు. జాజికాయ ని వంటకాల్లో రుచి మరియు వాసన కోసమే కాకుండా ఎన్నో వ్యాధులను నయం చేయడానికి కూడా ఆయుర్వేద మందుల తయారీలో జాజికాయ ని ఎక్కువగా వాడుతారు.

జాజికాయ ( jajikaya in telugu) ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది. దీని విత్తనాలు చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి. జాజికాయ ఇండోనేషియా కి చెందిన మొక్క ( jajikaya plant ) . ఈ మొక్క సతత హరిత చెట్టు అయిన మిరిస్టికా ఫ్రాగ్రాన్స్ యొక్క విత్తనాల నుంచి తయారు చేసిన మసాలా దినుసు మొక్క ఇది. ఇలాంటి సంతతికి చెందిన మొక్కలు ఉష్ణమండల ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా పెరుగుతుంది. జాజికాయ కొంచం నట్టి రుచిని కలిగి ఉంటుంది.

జాజికాయ ని ( jajikaya powder ) వంటకాల్లో మాత్రమే కాకుండా వైన్ తయారీలో మరియు టీ తయారీలో కూడా దీన్ని వాడుతారు. దీన్ని వాడటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం అన్నే దుష్ప్రభావాలు ఉంటాయి. పెద్ద పరిమాణం లో ఉండే జాజికాయ ని మాత్రం అస్సలు ఉపయోగించవచ్చు. ఇవి శరీరానికి ఎంతో హాని చేస్తాయి. జాజికాయ నూనె ని కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . దీన్ని కూడా అనేక మందుల తయారీలో వాడుతారు.

Jajikaya health benefits : జాజికాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

1.డిప్రెషన్ మరియు అంక్సియాటీ : డిప్రెషన్ మరియు అంక్సియాటీ వంటి వ్యాధులతో బాధపడేవారికి జాజికాయ ఒక చక్కటి పరిష్కారం గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాజికాయ లో మిరిస్టిసిన్ మరియు ఎలిమిసిన్ అనే రసాయనాలు ఉంటాయి ఇవి డిప్రెషన్ ని తగ్గిస్తాయి.

2.జాజికాయ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లు అయిన సేరెటోనిన్ మరియు డోపమైన్లను ఉత్తేజపరుస్తుంది. ఇవి స్ట్రెస్ ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా మెదడు ఆరోగ్య వంతంగా మరియు చురుకుగా పని చేయడానికి ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.

3.నిద్ర లేమి సమస్య : చాలా మంది మహిళలు లేదా పురుషులు పని వొత్తిడి కారణంగా నిద్ర లేమి సమస్య తో బాధపడుతుంటారు. అలాంటి వారు జాజికాయ ని తీసుకుంటే నిద్ర లేమి సమస్య తీరుతుంది. జాజికాయ ఆయిల్ ని మరియు ఆలివ్ నూనె ని మిక్స్ చేసి తలకు పట్టించడం వలన నిద్ర లేమి సమస్య తగ్గుతుంది.

4.కీళ్ళ నొప్పి లేదా కండరాల నొప్పి : కీళ్ళ నొప్పులు అధికంగా ఉండడం వల్ల చాలా మంది నడవలేకపోతారు. కండరాల నొప్పితో కూడా చాలా మంది బాధపడుతుంటారు.అలాంటి వారు జాజికాయ నూనె ని, కొబ్బరి నూనె తో కలిపి నొప్పి ఉన్నచోట అప్లై చేయాలి ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

5.జాజికాయలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జాజికాయ మొహంపై ఉన్న మొటిమలను తగ్గించడం లో ఉపయోగపడుతుంది.

6.అజీర్తి, వాంతులు , విరేచనాలు వంటి వాటితో బాధపడేవారు జాజికాయ ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES