HomeHealthJack fruit in telugu : పనస పండు తో ఆరోగ్య ప్రయోజనాలు

Jack fruit in telugu : పనస పండు తో ఆరోగ్య ప్రయోజనాలు

Jack fruit in telugu :

జాక్ ఫ్రూట్ ని తెలుగు భాషలో పనస పండు గా ( Jack fruit in telugu ) పిలుస్తారు. ఈ పనస పండు మోరేసి అనే జాతికి చెందిన మొక్క మరియు ఇది మల్బరీ కుటుంబానికి చెందినది. సామాన్యంగా ఈ పనస పండ్లు వేసవి కాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీటిని పండు కాకముందు ముందు కర్రీ లాగాను మరియు పనస పండిన తర్వాత లోపల తొనలను తీసుకొని తింటూ ఉంటారు.పనస పండు పైన లేత ఆకుపచ్చని రంగులో ఉండి లోపల పసుపు రంగులో ఉంటుంది. అలాగే లోపల పసుపు రంగులో ఉన్న తొనలలో పుష్కలంగా మన శరీరానికి అవసరమైన అన్ని ఔషధ గుణాలు ఉన్నట్టు డాక్టర్స్ చెప్తున్నారు.

పనస పండు ( Jack fruit in telugu ) తొనలు తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ మరి ఏ ఇతర పండ్లలో దొరకవని డాక్టర్స్ చెప్తున్నారు. ఈ పనస పండు ప్రపంచంలోనే అతిపెద్ద పండుగా పేరు పొందింది. ఈ పనస చెట్టు చాలా ఎక్కువ పొడుగు గా పెరుగుతుంది. ఈ పనస చెట్లు ఎక్కువగా ఆసియా దేశాలలో పెరుగుతాయి.
పనస పండు తినడం వలన లభించే విటమిన్స్ మరియు మినరల్స్ మనకి వేరే ఏ ఇతర పండులో లభించవని డాక్టర్స్ చెప్తున్నారు.

jack fruit in telugu

పనస పండు లో పోషక విలువలు : Neutrients values in jack fruit in telugu

వంద గ్రాముల పనస తొనలలో నీరు 70 శాతం , కార్బోహైడ్రెట్స్ 22mg , ప్రోటీన్ 1.73, హెల్తీ ఫ్యాట్ 0.65 mg, ఫైబర్ 1.6 mg, చెక్కర 19 mg మరియు విటమిన్ ఎ 5mg, విటమిన్ సి 13.1, విటమిన్ ఇ 0.32, విటమిన్ బి లో b1 b2 b3 b6 b9 అన్ని కూడా పనస పండులో పుష్కళంగా లభిస్తాయి. అంతే కాదు ఇందులో పొటాషియం 420 mg, కాల్షియం 22mg, పాస్పరస్ 20 mg, సోడియం 1.5mg,జింక్ 0.21,mg ఐరన్ 0.19 mg ఇలా అన్ని రకాల మినరల్స్ ని పనస పండులో పొందవచ్చు.

పనస పండు ఉపయోగాలు : Health benefits of Jack fruit in telugu

1.పనస పండు ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణ వ్యవస్థని మంచిగా పని చేసేలా చేస్తుంది.
2.పనస పండులో అధిక ఫైబర్ ఉండటం వలన ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తు రక్తంలోని చక్కెర స్థాయిని పెంచకుండా చూస్తుంది.
3.పనస పండులో సహజ సిద్ధమైన యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరాన్ని ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి.
4.పనస పండులో ఎలాంటి వైరస్ ని అయిన ఎదురుకోవడానికి కావలసిన విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. అవి కావల్సినంత ఇమ్మ్యూనిటిని శరీరానికి అందచేస్తాయి.
5.పనస పండు అధిక శాతం విటమిన్ ఎ ఉంటుంది. కాబట్టి పనస పండు తినడం వలన కళ్ళు బాగా కనిపిస్తాయని డాక్టర్స్ సూచిస్తున్నారు.
6.పనస పండులో ఎముకల బలానికి కావాల్సిన కాల్షియం ఉండడం వల్ల ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.
7.పనస పండులో విటమిన్ ఇ మరియు సి పుష్కలంగా లభిస్తాయి. అవి చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతాయి.
8.పనస పండులో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
LATEST ARTICLES