hilsa fish :
పులస చేప pulasa fish అనగానే మనకు ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లా గుర్తుకువస్తుంది. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో పులస చేప ఎంతో ప్రసిద్ధి చెందింది. గోదావరి జిల్లాల్లో నే కాకుండా మన దేశం లో ఇతర ప్రాంతాల్లో ఈ చేపని ఎంతో ఇష్టంగా తింటారు. పులస చేప ని hilsa fish ఎక్కువగా ఫ్రై లేదా కర్రీ చేసుకుని తింటారు. పులస చేపలకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. వీటి ధర కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వీటి రుచి అలా ఉంటుంది మరి.
గోదావరి జిల్లా ప్రజలు కూడా ఈ చేప ధర ఎక్కువ అని తెలిసి కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అక్కడ ఈ పులస చేప పై ఒక సామెత కూడా ఉంది. అది ఏంటంటే ఆస్తులు అమ్ముకున్న సరే జీవితం లో ఒక్కసారి అయిన పులస చేప తినాలి అని. ఈ పులస చేపకు, గోదావరి జిల్లా ప్రజలకు విడతీయరాని బంధం ఉంది.
పులస చేప ఎక్కువగా ఆస్ట్రేలియా లో పెరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలు అవ్వగానే అవి ఆస్ట్రేలియా నుంచి ఉభయ గోదావరి జిల్లాలకి వలస వస్తాయి. ఈ వలస వచ్చిన చేపలు ఇక్కడే గుడ్లు పెట్టి వాటి సంతతిని పంచుకుంటాయి. ఆస్ట్రేలియా లో ఈ పులస చేపల్ని హిల్సా ఫిష్ అంటారు hilsa fish in English .
హిల్సా ఫిష్ ని తెలుగులో పులస pulasa చేప అంటారు hilsa fish in telugu . ఈ చేపల్ని గోదావరి జిల్లా ప్రజలే కాకుండా ముఖ్యంగా బెంగాలీ లు ఈ చేపల్ని ఎక్కువగా తింటారు . బెంగాలీ ప్రజలు దీనికి మించిన మాంసాహారం ఇంకొకటి లేదని నమ్ముతారు. బంగ్లాదేశ్ లో కూడా ఈ చేపలు చాలా ఫేమస్. అక్కడ ప్రజలు కూడా వీటిని ఎక్కువగా తినడానికి ఇష్ట పడతారు. బంగ్లాదేశ్ వీటిని వివిధ దేశాలకి ఎగుమతి కూడా చేస్తుంది . ఆ దేశ చేపల ఉత్పత్తి లో వీటి శాతం 12.
Hilsa fish price : పులస చేప కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పులస చేప సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే దొరుకుతుంది. ఈ చేపకు 6 వేల నుంచి 8 వేల వరకు ఉంటుంది. కొన్ని సార్లు ఈ చేపలని వేలం పాటలో ద్వారా కూడా అమ్ముతారు అప్పుడు ఇంకా ఎక్కువ ధరకు కూడా అమ్ముడు పోవచ్చును.
Neutrients values in hilsa fish : హిల్సా చేపలో పోషక విలువలు
హిల్సా చేపలో మన శరీరానికి కావల్సిన పోషకాలు పదార్ధాలు పుష్కళంగా వుంటాయి. హిల్సా చేపలో కేలరీలు , కార్బోహైడ్రేట్స్ , ప్రొటీన్లు , కాల్షియమ్ , ఐరన్ , విటమిన్ B12 మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
Hilsa fish benefits : పులుస చేప యొక్క ఉపయోగాలు
1.పులస చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.ఇది రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలో మంచి కొలెస్టరాల్ స్థాయిని పెంచుతుంది. మీ గుండెను ఆరోగ్యంగా పదిలంగా ఉంచుతుంది.
2.హిల్సా చేపలను తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరంలో రక్త నాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
3.హిల్సా చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల అర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనం లభిస్తుంది.
4.హిల్సా చేపలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపు ని మెరుగుపరుస్తుంది.
5.హిల్సా చేపలో ఎల్ అర్జినిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మన శరీరములో ప్రొటీన్లను నిర్మించడానికి మరియు కండరాల పెరుగుదల కి ఉపయోగపడుతుంది.
6.మన మెదడు దాదాపు గా 65 % కొవ్వుతో ఉంటుంది. హిల్సా చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఇది మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా నాడీ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
7.హిల్సా చేపలో విటమిన్ డి ఉంటుంది. ఇది మన శరీరములో ఎముకలు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.
8.హిల్సా చేపలో సెలీనియం ఉంటుంది. ఇది మన శరీరం ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా కాపాడుతుంది.
9.హిల్సా చేపలో అయోడిన్ ఉంటుంది. మన శరీరములో థైరాయిడ్ హార్మోన్లు తయారు చేయడంలో అయోడిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
10.హిల్సా చేపలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరములో దెబ్బ తిన్న కణాలను మరమ్మతు చేయడంలో ఉపయోగపడుతుంది.