Salmon fish in telugu :
సాల్మన్ ఫిష్ ని తెలుగు లో మాగ ( maga) , బుడత మాగ ( budatha maga) లేదా మాఘ ( magha ) అని పిలుస్తారు (salmon fish in telugu). ఈ చేప ఎక్కువగా సముద్రాల్లో పెరుగుతుంది. మన దేశంలో ఈ చేప పెరగడం చాలా కష్టం. సాల్మన్ ఫిష్ ఎక్కువగా పసిఫిక్ మహా సముద్రంలో ఎక్కువగా పెరుగుతాయి. మన దేశంలో కూడ అచ్చం సాల్మన్ ఫిష్ ( salmon fish in telugu) లాగే పోలి వున్న చేపలు మార్కెట్ లో లభ్యం అవుతాయి. అచ్చం ఈ చేపలు రియల్ సాల్మన్ ఫిష్ లాగే ఉంటాయి. చూడటానికే ఒకటిలా ఉండటమే కాకుండా వీటి రుచి కూడా రియల్ సాల్మన్ ఫిష్ లాగే ఉంటుంది. సాల్మన్ ఫిష్ జిడ్డు గల చేప. ఈ సాల్మన్ ఫిష్ (salmon fish in telugu) లో చాలా ప్రొటీన్లు , విటమిన్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
సాల్మన్ ఫిష్ ధర : salmon fish price
సాల్మన్ ఫిష్ విదేశాల్లో పెరిగే చేప అయినప్పటికీ మన దేశంలో లో కూడా అచ్చం సాల్మన్ ఫిష్ లాగే పోలి వున్న చేపలు మరియు రియల్ సాల్మన్ ఫిష్ లు కూడా మార్కెట్ లో లభ్యం అవుతాయి. సాల్మన్ ఫిష్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. సాల్మన్ ఫిష్ ధర మార్కెట్ లో 1000 రూపాయల కనిష్ట ధర నుంచి 2000 రూపాయల గరిష్ఠ ధర వరకు ఉంది. ఆన్లైన్ లో కూడా మనం సాల్మన్ ఫిష్ ని ఆర్డర్ చేసుకోవచ్చు.
సాల్మన్ ఫిష్ లో పోషక విలువలు: Nutrition values in salmon fish
సాల్మన్ ఫిష్ లో మన శరీరానికి అవసరమైన పోషక విలువలు అన్ని ఉంటాయి. సాల్మన్ ఫిష్ లో ఎక్కువగా ప్రోటీన్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా సాల్మన్ ఫిష్ లో విటమిన్ B12, విటమిన్ B6 , నియాసిన్, రిబోఫ్లావిన్, తియామిన్, సెలీనియం మరియు ఫోలిక్ ఆమ్లం ఉంటాయి.
సాల్మన్ ఫిష్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు : Health benefits of salmon fish
1.సాల్మన్ ఫిష్ లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలో అధిక రక్త పోటు ను తగ్గిస్తుంది.
2.ఉబకాయంతో బాధ పడేవారు ఈ సాల్మన్ ఫిష్ ని తింటే బరువు తగ్గి స్లిమ్ గా అవుతారు. సాల్మన్ ఫిష్ లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. అంతేకాకుండా తక్కువ కొవ్వు ఉంటుంది. దీనివల్ల ఉబకాయం వచ్చే అవకాశం ఉండదు.
3.గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే సాల్మన్ ఫిష్ కచ్చితంగా తినాల్సిందే. ఎప్పుడైతే రక్తం ఒమేగా 3 యాసిడ్స్ స్థాయి తగ్గుతుందో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సాల్మన్ ఫిష్ లో తక్కువ కొవ్వు ఉండటం వల్ల గుండె జబ్బులతో బాధపడేవారు సాల్మన్ ఫిష్ ఎలాంటి డౌట్ లేకుండా తినవచ్చు. సాల్మన్ ఫిష్ లో తక్కువ కొవ్వు ఉంటుంది కాబట్టి గుండె కి ఎలాంటి హాని జరగదు.
4.సాల్మన్ ఫిష్ లో సెలీనియం ఉంటుంది. సెలీనియం మనకు క్యాన్సర్ రాకుండ కాపాడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది.
5.సాల్మన్ ఫిష్ ని ఎముకల నొప్పితో బాధపడుతున్నవారు తింటే వారికి ఉపశమనం లభిస్తుంది.
6.సాల్మన్ ఫిష్ లో ఎక్కువగా విటమిన్ B12 ఉంటుంది.విటమిన్ B 12 డెఫిషియన్సీ తో బాధపడుతున్నవారు సాల్మన్ ఫిష్ తింటే శరీరంలో విటమిన్ B12 స్థాయి ని పెంచుతుంది.
7.సాల్మన్ ఫిష్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పొటాషియం స్ట్రోక్స్ రాకుండా అడ్డుకోవడమే కాకుండా మీ రక్త పోటు ను అదుపులో ఉంచుతుంది.
8.కొందరు జ్ఞాపక శక్తి లేమి తో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టాలంటే సాల్మన్ ఫిష్ ని వారానికి రెండుసార్లు తింటే చాలు మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది.
9.సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వుండటం వలన మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
10.థైరాయిడ్ వ్యాధి సమస్యతో బాధపడుతున్నవారు సాల్మన్ ఫిష్ ని తింటే సాల్మన్ ఫిష్ లో సెలీనియం ఉంటుంది కాబట్టి ఇది థైరాయిడ్ వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది.
సాల్మన్ ఫిష్ దుష్ప్రభావాలు : side effects of salmon fish
1.సాల్మన్ ఫిష్ లో పాదరసం ఉంటుంది. పాదరసం మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అదికంగా పాదరసం తీసుకుంటే ఇది మన బ్రెయిన్ పై మరియు నాడి వ్యవస్థ పై చెడు ప్రభావం చూపిస్తుంది. అందుకే చేపలను మరి ఎక్కువగా తినకుండా మితంగా తీసుకోవాలి.
2.చేపలను ఎక్కువగా తింటే వేడి చేస్తుంది.గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటే గర్బస్రావం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు చేపలను తక్కువగా తినడం మంచిది.
3.అధికంగా చేపలను తింటే శరీరంలో పిసిబి పెరుగుతుంది. అధిక పిసిబి పెరిగితే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.
4.చేపలు సముద్రంలో ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి సముద్ర చేపలను తింటే సముద్రం లో ఏదైన రసాయనాలు చేపలోకి వెళితే అదే చేపలను మనం తింటే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
5.విషపూరితమైన చేపలను తింటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు చెప్తున్నారు.