HomeHealthpumpkin seeds in telugu : గుమ్మడి గింజల ఉపయోగాలు

pumpkin seeds in telugu : గుమ్మడి గింజల ఉపయోగాలు

pumpkin seeds in telugu :

Pumpkin seeds ని తెలుగులో గుమ్మడి గింజలు అనే పేరు తో ( pumpkin seeds in telugu ) పిలుస్తారు. అందరూ గుమ్మడికాయ ని దిష్టి తీయడానికి మాత్రమే పనికి వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ గుమ్మడికాయ గింజల ఉపయోగాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యానికి గురవుతారు. గుమ్మడి గింజలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడి గింజల్లో మానవ శరీరానికి కావల్సిన పోషకాలు అన్ని ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి ఒక్కరూ తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా చూస్తుంది. గుమ్మడి గింజలను ( pumpkin seeds in telugu ) పాలలో కానీ నీళ్ళ లో కానీ రాత్రి పూట నానబెట్టి ఉదయం నిద్ర లేవగానే తినడం మంచిది. గుమ్మడి గింజల్లో అధిక పోషకాలు యాంటి యాక్సిడెంట్స్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో పొటాషియం ,జింక్, భాస్వరం మరియు కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి.

గుమ్మడి గింజల్లో ఉన్న పోషకాలు : Nutrition values in pumpkin seeds

1.గుమ్మడి గింజల్లో ముప్పై శాతం ప్రోటీన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన మానవ శరీరానికి ఎంతో మేలు చేకూరుతుందని డాక్టర్స్ చెపుతున్నారు.
2.గుమ్మడి గింజల్లో 110 శాతం ఐరన్ కలిగి ఉంటుంది. ఐరన్ ఉన్న ఆహారం తీసుకుంటే రక్తం పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది.
3.గుమ్మడి గింజల్లో 71 శాతం జింక్ ఉంటుంది.కాబట్టి గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల జింక్ డెఫిషియన్సీ ని నివారించవచ్చు.

Pumpkin seeds in telugu

గుమ్మడి గింజలు వలన ఉపయోగాలు : Health benefits of pumpkin seeds

1.గుమ్మడి గింజలు తీసుకోవడం వలన ముఖ్యంగా లివర్ మరియు గుండెకు ఎంతో మేలు చేకూరుతుందని డాక్టర్స్ చెపుతున్నారు.

2.శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరగడానికి గుమ్మడి గింజలను ప్రతి రోజు ఆహారంలో తీసుకోవాలి ఇలా తీసుకుంటే మీ ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి మీ మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

3.గుమ్మడి గింజల్లో ప్రత్యేకమైన ఒక గుణం ఉంది .అది ఏమిటంటే ఇది ఆల్కలైన్ ని ఫామ్ చేస్తుంది. ఇది వేరే ఏ ఆహారంలో దొరకదు కాబట్టి గుమ్మడి గింజలను ప్రతి రోజు ఉదయం ఆహారంలో తీసుకోవాలి.

4.కిడ్నీ లో రాళ్ళు వ్యాది తో బాధపడుతున్న వారికి గుమ్మడి గింజలు తీసుకోవడం ద్వారా కిడ్నీ లో రాళ్ళు తగ్గిస్తుంది మరియు మళ్ళీ కిడ్నీ లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

5.గుమ్మడి గింజల్లో ఎక్కువ B కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి.ఇవి మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడతాయి.

6.గుమ్మడి గింజల్లో ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ప్రతి రోజు కొన్ని గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వలన మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

7.గుమ్మడి గింజల్లో ఎక్కువ శాతం విటమిన్ k ఉంటుంది. ఎవరైతే విటమిన్ k డెఫిషియన్సీ తో బాధపుతున్నారో వాళ్ళు రోజు ఉదయం ఓ గుప్పెడు గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వలన చక్కని ఫలితం ఉంటుంది.

8.గుమ్మడి గింజల్లో సమ్మృద్ధిగా విటమిన్ E లభిస్తుంది. ఈ విటమిన్ E మన చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.కాబట్టి ఈ గుమ్మడి గింజలను రోజు ఆహారంలో తీసుకోవడం వలన మన చర్మాన్ని మరింత అందంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది.

9.గుమ్మడి గింజల్లో ఒక ప్రత్యేకమైన మంచి గుణం ఉంది.అది మన గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మన రక్త నాళాల్లో కొవ్వు చేరడం వలన మనకు గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయి అందులో LDL కొలెస్టరాల్ వలన మన గుండెకు చాలా అపాయం మరియు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గుండెకు ఇలాంటివి రాకుండా కాపాడుకోడానికి మన రక్తనాళాల్లో LDL కొలస్ట్రల్ ని తగ్గించే గుణం గుమ్మడి గింజల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి గుండె అనారోగ్యంతో బాధపడేవారు రోజు తప్పకుండా గుప్పెడు గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకుంటూ ఉండాలి.

10.ఎక్కువ మెగ్నీషియం ఉండే ఆహారాల్లో గుమ్మడి గింజలు మొదటవి. కాబట్టి మెగ్నీషియం శరీరంలో తక్కువ ఉండడం వలన బాధపడే వారు గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకుంటూ ఉండాలి.

11.గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది ఎముకలను ధృడంగా ఉండేలా చూస్తుంది. గుమ్మడి గింజలను తీసుకోవడం వలన మీ ఎముకలు దృఢంగా తయారవుతాయి.

12.గుమ్మడి గింజల్లో అధిక ఫైబర్ ఉంటుంది. కాబట్టీ గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల ఉబకాయం వచ్చే అవకాశం ఉండదు. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ ని కూడా మెరుగుపరుస్తుంది.

13.గుమ్మడి గింజల్లో ట్రిప్టోపాన్ ఉంటుంది. నిద్ర లేమితో బాధపడేవారు గుమ్మడి గింజలు తీసుకోవటం వల్ల నిద్ర లేని సమస్యకు చెక్ పెట్టవచ్చు.

14.గుమ్మడి గింజల్లో కుకుర్బిటిన్ ఉంటుంది కాబట్టి గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల జుట్టు బలంగా మరియు వొత్తుగా పెరుగుతుంది.

15.గుమ్మడి గింజలు రోజు తీసుకోవటం వల్ల మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.

Also read : పాలకూర తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

RELATED ARTICLES
LATEST ARTICLES