HomeHealthice apple : తాటి ముంజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ice apple : తాటి ముంజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Ice apple :

తాటి ముంజలు ( ice apple ) అంటే బహుశా తెలియని వారు ఉండరేమో.. ఎందుకంటే ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒకప్పుడు ఇవి ఎక్కువగా పల్లెటూర్లలో నివసించే వాళ్ళకి మాత్రమే తెలుసు. కాలక్రమేణా వీటిని పట్టణాలలో కూడా అమ్మడం మొదలుపెట్టారు. ఒకప్పుడు వీటిని పల్లెటూర్లలో వీటిని ఎలాంటి ఖర్చు పెట్టి కొనకుండా ఉచితంగా తినేవాళ్ళం. ఇప్పుడు వీటికి చాలా డిమాండ్ పెరిగింది. అందుకే వీటికి మార్కెట్ లో మంచి ధర పలుకుతుంది. ఈ తాటిముంజలు ( palm fruit ) మనకు వేసవి కాలంలో దర్శనమిస్తాయి. వీటిని ఐస్ ఆపిల్ ( ice apple )అని కూడా పిలుస్తారు.

తాటి ముంజలు ( thati munjalu ) తినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఆసక్తి చూపుతారు. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి వేసవి లో కచ్చితంగా తినండి. ఎందుకంటే ఇవి వేసవి కాలంలో మాత్రమే దొరుకుతుంది. ఇవి ఎలాంటి పురుగు మందులు వాడకుండా సహజంగా మాత్రమే పెరుగుతాయి. కాబట్టి వీటిని తినడం ఎంతో మంచిది. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తింటారు. కొందరు నేచురల్ గా చెట్టు నుంచి పండు ని తెంపి తింటారు. మరికొందరు అయితే వీటిని వేడి చేసి మరీ తింటారు. వీటిని ఎలా తిన్న కూడా మన ఆరోగ్యానికి మంచిదే.

ఈ తాటి పండు ( ice apple ) గుజ్జుతో వివిధ రకాల వంటకాలు చేస్తారు. తాటి పండు గుజ్జుతో గారెలు, బూరెలు, ఇడ్లీ లు మరియు దిబ్బ రొట్టె లు చేసుకుని తింటారు. ముఖ్యంగా కోనసీమ లో వీటితో వివిధ వంటకాలు చేసుకుని తింటారు. విదేశీయులు సైతం ఈ తాటి పండు ని ( ice apple fruit ) తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వీటి రుచి చాలా తీయ్యగా ఉంటుంది. ఇవి చూడటానికి గుండ్రంగా ఉంటాయి.

తాటి కాయ పై ( palm fruit ) భాగం చాలా గట్టిగా ఉంటుంది. దాని లోపలి భాగం లో 3 తాటి ముంజలు ఉంటాయి. ప్రతి తాటి కాయ కి మూడు తాటి ముంజలు మాత్రమే ఉంటాయి. వీటి పై పొట్టు లేత గోధుమ రంగులో ఉంటుంది. దీని లోపలి భాగం తెల్లటి రంగులో గుజ్జు ఉంటుంది. ఈ గుజ్జు లోపలి భాగం లో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ ఎంతో రుచిగా ఉంటుంది.

Palm fruit benefits

Ice apple price : తాటి ముంజల ధర

తాటి ముంజలకి ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే వీటికి ఉన్న రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి కాబట్టి వీటికి మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ లో ( ice apple online ) ప్రస్తుతం 12 తాటి ముంజలకి 100 రూపాయలు ఉంది.

Neutrients values in ice apple : తాటి ముంజలలో పోషక విలువలు

తాటి ముంజలు ( palm fruit ) తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎదుగుతున్న పిల్లలకి వీటిని తినిపించడం చాలా మంచిది. వీటిలో ఐరన్ , కాల్షియం, పొటాషియం , జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా తాటి ముంజలలో యాంటీ యాక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. తాటి ముంజల లో విటమిన్ ఇ, విటమిన్ కె, పాస్పరస్, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి.

Ice apple benefits : తాటి ముంజలతో ఆరోగ్య ప్రయోజనాలు ( palm fruit )

  • శరీర వేడి సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ తాటి ముంజలను ( thati munjalu ) తినడం ఎంతో మంచిది. ఎందుకంటే తాటి ముంజలు మన శరీరాన్ని చల్లబరుస్తుంది.
  • వేసవిలో ఎక్కువగా శరీరం డీహైడ్రేషన్ కి లోనవుతుంది. అలాంటప్పుడు ఈ తాటి ముంజలు తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
  • బరువు తగ్గాలి అనుకునే వారు ఈ తాటి ముంజల ని తినడం మంచిది. ఎందుకంటే దీంట్లో ఫైబర్స్ ఉంటాయి. ఇవి తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహపడతాయి. అంతేకాకుండా మెటబాలిజం కూడా సరిగా జరిగేలా చేస్తుంది.
  • తాటి ముంజల లో ( thati munjalu )నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని డయాబెటిక్ పేషంట్స్ తినడం ఎంతో మంచిది. దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల , రక్తంలో షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరగవు. రక్తంలో షుగర్ లెవెల్స్ ని పెరగకుండా కూడా చూస్తుంది.
  • తాటి ముంజలలో విటమిన్ సి ఉంటుంది. ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎలాంటి వ్యాధులు దరి చేరకుండా చేస్తుంది.
  • తాటి ముంజలు తినడం వల్ల మన చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో ఎక్కువగా మనకు దద్దుర్లు, ఎర్రబడడం వంటి చర్మ సమస్యలు వస్తాయి. వీటిని తినడం వల్ల దదర్లు , చర్మం ఎర్రబడడం వంటి సమస్యకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా చర్మం కాంతి వంతంగా అవుతుంది.
RELATED ARTICLES
LATEST ARTICLES