HomeHealthGhee benefits : నెయ్యి తో అధ్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Ghee benefits : నెయ్యి తో అధ్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Ghee benefits :

నెయ్యి ( ghee benefits ) తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ దీని వాసన కారణంగా కొందరికి నెయ్యి అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా మరి కొందరు అయితే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది అని నెయ్యి ( ghee ) అస్సలు తినరు. ఇది వరకు దీన్ని ఎక్కువగా తినే వారు కాదు కానీ ప్రస్తుతం దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన తర్వాత దీన్ని తినడానికి చాలా మంది మక్కువ చూపుతున్నారు. నెయ్యి కి మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది.

మార్కెట్ లో మనకి వివిధ రకాల బ్రాండ్ లతో నెయ్యి లభిస్తుంది. నెయ్యి కి ( ghee benefits ) మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటం వల్ల వీటిని కల్తీ చేసే వారు కూడా ఎక్కువే. అందుకే నెయ్యి కొనే ముందు స్వచ్చమైన నెయ్యి ఆ లేదా అని చూసుకుని తీసుకోవాలి. మార్కెట్ లో స్వచ్చమైన నెయ్యి కి ధర ( ghee price ) ఎక్కువే ఉంటుంది. ప్రస్తుతం ఒక కిలో నెయ్యి కి 500 రూపాయల నుంచి 3000 వేల రూపాయల వరకు ఉంటుంది.

ఎక్కువగా కేలరీలు ఉండే ఆహారంలో ఒకటి నెయ్యి . నెయ్యి లో ( ghee benefits ) అధికంగా కేలరీలు ఉంటాయి. దాదాపుగా 100 ml నెయ్యి లో 880 కేలరీలు ఉంటాయి. నెయ్యిలో ఎక్కువ శాతం కొవ్వు ఏ ఉంటుంది అంతేకాకుండా ఎక్కువ శాతం ఫైబర్ , చక్కెర, ప్రొటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు ఉండవు. 100 ml నెయ్యిలో దాదాపుగా 99 శాతం కొవ్వు మాత్రమే ఉంటుంది. దీంట్లో ఎక్కువ శాతం సంతృప్త కొవ్వు మాత్రమే ఉంటుంది.

నెయ్యిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నెయ్యిలో విటమిన్ కె, విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో బ్యూటిక్ యాసిడ్ ఉంటుంది.

నెయ్యి తో ఉపయోగాలు : ghee benefits in telugu

  • నెయ్యి లో ఎక్కువ శాతం కొవ్వు ఉంటుంది. ఇందులో ఎక్కువగా మంచి కొవ్వు మాత్రమే ఉంటుంది. ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండ కాపాడుతుంది.
  • నెయ్యి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటె నెయ్యిలో బ్యూటెన్ ఉంటుంది. బ్యూటెన్ శరీరంలో T కణాల ఉత్పత్తి ని పెంచుతుంది.
  • నెయ్యిలో ( ghee benefits ) విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ ఉంటాయి. విటమిన్ ఎ మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ ఇ మన చర్మానికి మరియు హెయిర్ ధృడంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా సంతానోత్పత్తికి ఉపయోగపడే విటమిన్లు నెయ్యిలో ఉంటాయి.
  • నెయ్యి తినడం వల్ల పెద్ద ప్రేగు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
  • నెయ్యి లో విటమిన్ కె2 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ కె2 మన శరీరంలో ఎముకలు ధృడంగా ఉండేలా చూస్తుంది.
RELATED ARTICLES
LATEST ARTICLES