Elaichi :
ఇలాచి Elaichi ( ఏలకులు ) ఒక సుగంధ ద్రవ్యం. ఇలాచి చూడటానికి ఆకుపచ్చ రంగులో చిన్నగా ఉంటాయి. వీటిపై ఉన్న చర్మం చాలా గట్టిగా ఉంటుంది. ఈ ఇలాచి లోపలి భాగంలో చిన్నగా విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలు నలుపు రంగులో ఉంటాయి. వీటి వాసన చాలా ఘాటుగా బాగుంటుంది. ఇలాచి Elachi మనం ఎక్కువగా భారతదేశం లో వంటకాల్లో సుగంధ ద్రవ్యంగా వాడతారు. దిన్ని వంటకాల్లో వాడటం వల్ల వంట మరింత ఎక్కువగా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో కూడా వాడతారు.
ఇలాచి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాచి Elaichi మనకు చిన్న షాప్ ల దగ్గర నుంచి సూపర్ మార్కెట్ లో కూడా లభిస్తుంది. కానీ వీటి సైజ్ బట్టి మరియు దాని యొక్క నాణ్యత బట్టి ఇలాచి కి ధర ( Elaichi price ) ఉంటుంది. ఇలాచి ( ఏలకులను ) ఎక్కువ గా మనదేశం లో బిర్యానీ వంటకాల్లో వాడతారు. దీని వల్ల బిర్యానీ ఎక్కువ రుచిగా ఉంటుంది.

ఈ ఇలాచి నీ ఎక్కువగా భారత దేశం, ఇండో చైనా దేశం మరియు శ్రీలంక , నేపాల్ , టాంజానియా వంటి దేశాలు ఎక్కువగా పండిస్తాయి. ఇలాచి నీ మన వాడుక భాషలో ఏలకులు ( alakulu ) అని పిలుస్తారు. అంతేకాకుండా ఇలాచి యొక్క శాస్త్రీయ నామం ఇలాటెరియా కార్డమామ్ .ఇది సిటామినేసి కి కుటుంబానికి చెందిన మొక్క. వీటిలో రెండు రకాల ఏలకులు ఉంటాయి. ఒకటి చిన్న ఏలకులు ( choti elaichi ) మరియు ఇంకోటి పెద్ద ఏలకులు ( long elaichi ). ఈ రెండు ఏలకులలో ఒకే విదమైన ఔషధగుణాలు ఉంటాయి.
ఇలాచి ( ఏలకులు ) తో ఆరోగ్య ప్రయోజనాలు : elaichi benefits :
- ఇలాచి నీ ( elaichi powder ) ఎక్కువగా సుగంధ ద్రవ్యంగా వాడతారు. దిన్ని ఎక్కువగా వంటకాల్లో ఫ్లవౌరింగ్ ఏజెంట్ గా వాడతారు. దిన్ని వల్ల వంటకాలు మరింత రుచి గా ఉంటాయి.
- చాలామంది ఉబ్బసం వ్యాధితో బాధపడుతుంటారు అలాంటి వారి దిన్ని తినడం వల్ల ఉబ్బసం వ్యాధి తగ్గుతుంది.
- ఎక్కువగా వర్క్ టెన్షన్ వల్ల చాలా మంది తల నొప్పి తో బాధపడుతుంటారు. అలాంటి వారు ఇలాచి నీ బాగా నూరి నుదుటికి పట్టిస్తే వెంటనే తలనొప్పి చిటికలో మాయం అవుతుంది.
- యాలకులను ( alakulu ) ఎక్కువగా కషాయం తయారీలో వాడతారు. దిన్ని ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో వాడతారు. దీనితో చేసిన కషాయం తాగడం వల్ల దగ్గు త్వరగా తగ్గుతుంది.
- కొందరికి నోటిలో క్రీములు ( బ్యాక్టీరియా ) ఎక్కువగా ఉండటం వల్ల నీటిలో దుర్వాసన వస్తుంది. దిన్ని వల్ల మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తితో వారికి మన నోటి దుర్వాసన వస్తుంది. అలాంటి వారు ఈ యాలకులను తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.