HomeHealthAjwain in telugu : వాము తో అద్భుతమైన అరోగ్య ప్రయోజనాలు

Ajwain in telugu : వాము తో అద్భుతమైన అరోగ్య ప్రయోజనాలు

Ajwain in telugu :

మన పూర్వీకుల నుంచి ప్రస్తుత ఆధునిక కాలం వరకు వాము ( ajwain in telugu ) గురించి బహుశా తెలియని వాళ్ళు ఉండరేమో. ఎందుకంటే వాము గొప్పతనం అలాంటిది మరి. మన పూర్వీకులు కూడా చాలా వ్యాధులను నయం చేయడానికి వాము ని వాడేవారు. Carom seeds ని తెలుగు లో వాము ( ajwain in telugu ) అని పిలుస్తారు. Carom seeds ని హిందీలో Ajwain ( అజ్వైన్) అని పిలుస్తారు. వృక్ష శాస్త్ర పరిభాషలో carom copticum అనే పేరుతో పిలుస్తారు. వివిధ రకాల రోగాలను నయం చేసే గుణం వాము కి మాత్రమే ఉంటుంది.

వాము గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. వాము లో ఫైబర్ , ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వాము ని ఎక్కువగా వంటకాల్లో మరియు ఆయుర్వేదం లో వాడుతారు. వాము ఉబకాయం తో బాధపడుతున్నవారు తీసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.

వాము ( ajwain in telugu ) మొక్క మంచి సువాసనను కలిగి ఉంటుంది. వాము యొక్క పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఈ పువ్వుల నుంచే వాము విత్తనాలు ( carom seeds ) వస్తాయి. వాము ( అజ్వైన్ ) ఆకుపచ్చ నుండి గోధుమ రంగులో ఉంటాయి. వాము జీలకర్ర లా చిన్నగా ఉంటుంది. వాము సైజ్ లో చిన్నది అయిన చేసే మేలు మాత్రం చాలా పెద్దది. వాము (అజ్వైన్ ) చాలా ఘాటు మరియు చేదు రుచిని కలిగి ఉంటుంది. ఈ వాము విత్తనాలను ( carom seeds ) వంటకాల్లో ఎక్కువ వాడుతారు.

ajwain in telugu

వాము తీసుకోవడం వల్ల కలిగే అరోగ్య ప్రయోజనాలు : health benefits of ajwain ( carom ) seeds

1.ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉబకాయం తో బాధపడుతుంటారు. ఉబకాయం వల్ల చాలా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. వాము తీసుకోవడం వల్ల బరువు తగ్గి సన్న బడతారు.

2.అధిక పని వొత్తిడి కారణంగా తలనొప్పి రావడం సహజం. తలనొప్పితో బాధపడేవారు. వాము ని గ్రైండ్ చేసి , తర్వాత వాము వాసనని చూస్తే త్వరగా తలనొప్పి తగ్గుతుంది.

3.చాలా మంది అధిక చెవిపోటు తో బాధ పడుతుంటారు. అలాంటి వారు వాము ని , వెల్లుల్లి మరియు నువ్వుల నూనె ని గ్రైండ్ చేసి వాటి నుంచి వచ్చే రసాన్ని చెవిలో వేయాలి.ఇలా చేయడం వల్ల చెవిపోటు తగ్గిపోతుంది.

4.నీళ్ళ విరేచనాలు అయినపుడు కొద్దిగా వాము ని నీళ్ళ లో వేసుకుని తాగితే విరేచనాలు తగ్గుతాయి.

5.అజీర్ణం సమస్యతో చాలా మంది బాధపడతారు. అలాంటి వారికి వాము ఒక చక్కని పరిష్కారం. మాంసాహారం తీసుకున్న తర్వాత లేదా బయట దొరికే జంక్ ఫుడ్ తినడం వల్ల మనకి జీర్ణం త్వరగా అవ్వదు. అలాంటి అప్పుడు కొన్ని నీళ్ళ లో వాము పొడిని వేసుకుని తాగాలి.ఇలా చేస్తే మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

6.మలబద్ధక సమస్యతో బాధపడేవారు వాము ని తీసుకుంటే మలబద్దక సమస్య పోతుంది.

7.శరీరంలో ఉండే కొలెస్టరాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ గుండె కి ఎంతో హాని చేస్తాయి. వాము ని తీసుకోవడం వల్ల మన శరీరంలో వుండే LDL చెడు కొలెస్టరాల్ ని స్థాయిని మరియు ట్రైగ్లిజరైడ్స్ స్ధాయిని తగ్గిస్తుంది. దీనివల్ల గుండె పోటు వచ్చే అవకాశం తగ్గుతుంది.

8.దగ్గు, జలుబు మరియు శ్వాస పీల్చుకోవడం వంటి వ్యాధులతో బాధపడుతున్నవారు వాము ని తీసుకుంటే ఉశమనం లబిస్తుంది. కొడైన్ కంటే ఎక్కువ యాంటీకఫింగ్ గుణాలు వాము లో ఉంటాయి. అందుకే వాము తీసుకుంటే దగ్గు చాలా త్వరగా తగ్గుతుంది.

9.తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నవారు లేదా జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడేవారు వాము ని , కరివేపాకు , ఎండు ద్రాక్ష , కొద్దిగా చక్కెర వేసి ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని ఒక పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టు బలంగా ధృడంగా ఉంటుంది.తెల్ల జుట్టు సమస్య కూడా పోతుంది.

10.మొహం పై మొటిమల మరియు మచ్చల సమస్యతో బాధపడేవారు వాము ని తీసుకుంటే మొహం పై మొటిమలు మరియు మచ్చలు పోతాయి. వాము ని పేస్ట్ లా చేసి మొహానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు పూర్తిగా మాయం అవుతాయి.

11.అర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు వామును పేస్ట్ లా చేసి నొప్పి ఉన్న చోట అప్లై చేస్తే కీళ్ళ నొప్పి తగ్గుతుంది.

వాము తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు : side effects of Ajwain

1.గర్భిణీ స్త్రీలు వాము తీసుకోవడం అంత మంచిది కాదు ఎందుకంటే ఒకవేళ వాము ఎక్కువ తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

2.వాము లో thymol ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దిన్ని తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.ఎందుకంటే thymol ని ఎక్కువ తీసుకుంటే అసిడిటీ మరియు తలనొప్పి అంతేకాకుండా వాంతులు అయ్యే ప్రమాదం ఉంది.

3.వాము ని అధికంగా తింటే నోట్లో పుండ్లు అయ్యే ప్రమాదం ఉంది.

4.అలెర్జీ సమస్యతో బాధపడుతున్నవారు వాము తీసుకుంటే తలతిరగడం వంటి సమస్యలు వస్తాయి.

5.వాము గర్భిణీ స్త్రీలు తీసుకుంటే పిండాబివృధ్దిని అడ్డుకునే ప్రమాదం ఉంది.కాబట్టి గర్భిణీ స్త్రీలు వాము తీసుకోకూడదు.

RELATED ARTICLES
LATEST ARTICLES