Guggilam :
గుగ్గిలం ( guggilam ) గురించి బహుశా తెలియని వారు ఉండరేమో ఎందుకంటే గుగ్గిలం నీ ఎక్కువగా మనదేశం లో ఆడవాళ్ళు దేవుడికి పూజ చేసే సమయం లో గుగ్గిలం ని దూపంగా వాడుతారు. మార్కెట్ లో మనకి గుగ్గిలం వివిధ రకాల బ్రాండ్ల పేరుతో లభిస్తుంది.గుగ్గిలం తో ఇంట్లో ధూపం వేయడం వల్ల అంత మంచి జరుగుతుందని ఒక నమ్మకం. అందుకే పూజ సమయం లో ఇంట్లో ధూపం వేస్తారు. గుగ్గిలం నీ పూజలో నే కాకుండా ఆయుర్వేద ఔషధాలు తయారీలో వాడుతారు. పూర్వ కాలం నుండి ఈ గుగ్గిలం నీ మనవాళ్ళు అనేక మందుల తయారీ లో వాడుతున్నారు.
గుగ్గిలం కూడా ఒక వ్యాపార పంట. గుగ్గిలం నీ ధూపం ( sambrani ) గానే కాకుండా అగర్బత్తి ( agarbatti ) తయారీలో కూడా వాడుతారు. గుగ్గిలం చెట్టు నుంచి వచ్చే బంక నీ ఎండ లో ఎండబెట్టి ఆ తర్వాత గట్టి పడ్డాక దీన్ని ఉపయోగిస్తారు. ఈ తరహా మొక్కలు ఆడ వేర్లు మరియు మగ వేర్లను కలిగి ఉంటాయి.
గుగ్గిలాలు నాలుగు రకాలు :
- తెల్ల గుగ్గులు ( Tella guggilam )
- రత్న పురి గుగ్గులు ( Ratnapuri guggilam )
- మహిసాక్షి గుగ్గులు ( mahasakshi guggilam )
- పుట్ట గుగ్గులు ( putta guggilam )
గుగ్గిలం ఉపయోగాలు :
- గుగ్గిలం నీ ఆయుర్వేదిక్ మందుల తయారీ లో ఎక్కువగా వాడుతారు. గుగ్గిలం నీ కీళ్ళ నొప్పుల సమస్యకి ఎక్కువగా వాడుతారు. గుగ్గిలం నీ వాడటం కీళ్ళ నొప్పుల బాధ తగ్గుతుంది.
- టీవీ లేదా ఎక్కువగా ల్యాప్టాప్ చూసే వాళ్ళకి మెడ నొప్పి ఎక్కువగా వస్తుంది. అలాంటి వారు ఈ గుగ్గిలం నీ త్రిఫల చూర్ణ తో గాని లేదా తిప్ప తీగతో కానీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- గుగ్గిలం నీ మధుమేహ వ్యాధి నివారణ కి కూడా వాడుతారు. ఇది షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. గుగ్గిలం ని అశ్వగంధ తో కలసి ఉపయోగిస్తే చాలా మంచిది.
- గుగ్గిలం ని తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా శరీరం లో రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.
- గొంతు వాపుతో ఇబ్బంది పడే వారు ఈ ఎర్ర గుగ్గిలం నీ తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఎర్ర గుగ్గిలం నీ తేనె తో కలిపి తీసుకోవడం మంచిది. అంతేకాకుండా లైంగిక సమస్యలతో బాధ పడుతున్న వారు కూడా గుగ్గిలం నీ తీసుకుంటే లైంగిక సమస్య నీ అధిగమించవచ్చు.