Finger millet in telugu : రాగులు రోజు తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుత బిజీ లైఫ్ లో మంచి ఆహారం కన్న బయట దొరికజంక్ ఫుడ్ నే ఎక్కువ తీసుకుంటున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వలన స్థూలకాయం వస్తుంది. స్థూలకాయం వల్ల టీనేజర్స్ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు .
రాగుల తో స్థూలకాయానికి చెక్ పెట్టవచ్చు అని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అధిక బరువు ను తగ్గించడానికి వ్యాయామం చేయడం యే కాకుండా డైలీ డైట్ లో బరువు ని తగ్గించే ఆహారం కూడా తీసుకోవాలి. రాగులు లో కొలెస్టరాల్ ఉండదు కాబట్టి రోజూ రాగులు తినడం వల్ల అధిక బరువు తో బాధ పడేవారు ఈ రాగుల ను రోజూ ఆహారం తో పాటు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
అంతేకాకుండా రాగులలో విటమిన్స్ , ఫైబర్స్, కాల్షియమ్, కార్బోహైడ్రేట్లు చాలా పుష్కలంగా ఉంటాయి.
రాగులను రోజూ అల్పా ఆహారం గా తీసుకోవచ్చు. రాగులను జావా గా తీసుకోవచ్చు అంతేకాకుండా రాగులతో ఇడ్లీ ని మరియు దోష కూడా చేసుకుని తీసుకోవచ్చు.
రాగుల ఉపయోగాలు : Finger millet in telugu
- రాగులని రోజూ తీసుకోవడం వలన బీపీ ని తగ్గించుకోవచ్చు.
- కొలెస్టరాల్ తో బాధ పడేవారు రాగులు తీసుకోవడం వల్ల బరువుని తగ్గించుకోవచ్చు.
- రాగుల లో మెగ్నీషియం , కాల్షియమ్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఏముకలు నొప్పి కి రాకుండా కాపాడుతుంది.
- రాగుల్లో ఎక్కువ ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవడం వల్ల రక్త హీనత ని తగ్గిస్తుంది.
- రాగుల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ పేషంట్స్ రాగి తీసుకోవడం వల్ల రక్తం లో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
- ఫింగర్ మిల్లెట్స్ లో ఆంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి దీనివల్ల వయస్సు తక్కువగా కనపడుతుంది.
- కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రోజూ రాగులు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని డాక్టర్లు సూచిస్తున్నారు.
- ఇది కూడా చదవండి: చియా సీడ్స్ యొక్క ఉపయోగాలు