Betta fish or Fighter fish :
సాధారణంగా ప్రస్తుతం అందరూ ఇంట్లో అక్వేరియం లో చేపలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఇంట్లో పెంచుకునే చేపల పరిమాణం చిన్నగా ఉంటాయి. అంతేకాకుండా వీటిని ఎన్ని రోజులు పెంచిన కొంత పరిమాణం వరకు మాత్రమే పెరుగుతాయి. ఇంట్లో పెంచుకునే చేపలలో బెట్ట చేపలు betta fish ఒకటి. వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ బెట్ట betta fish చేపలను ఇంట్లో పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ బెట్ట చేపలకు మరొక పేరు కూడా ఉంది. ఈ బెట్ట చేపలను fighter fish ఫైటర్ ఫిష్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ చేపలు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి అందుకే వీటిని ఫైటర్ ఫిష్ అంటారు.
వీటిలో మగ సియామీస్ చేపలు Siamese Fighting Fish ఎక్కువ దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ చేపలు ప్రత్యర్థి తో పోరాడతాయి. ప్రత్యర్థి చేప చనిపోయే వరకు లేదా పారిపోయే వరకు ఈ చేపలు పోరాటం చేస్తాయి. ఇవి ఎక్కువగా అగ్నేశియ ప్రాంతాల్లో మంచి నీటిలో పెరుగుతాయి. ఈ చేపలు 6 నుంచి 8 సే.మీ ల పొడవు వరకు పెరుగుతాయి. ఈ చేపలు ఎరుపు మరియు గోధుమ రంగులో ఉంటాయి. శరీరంపై అక్కడక్కడ నీలం మరియు ఆకుపచ్చని గీతలతో చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
మిగతా చేపలతో వీటిని కలిపి అక్వేరియం లో పెంచరు. ఎందుకంటే ఇవి ఎక్కువగా దూకుడు స్వభావం తో ఉంటాయి .అంతేకాకుండా ఫైటర్ ఫిష్ fighter fish చేపలు ట్యాంక్ లో ఆక్సిజన్ లేకున్నా ఇవి బ్రతగగలవు . ఇతర చేపలు అయితే ఆక్సిజన్ లేకుంటే కంగారు పడి చేనిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. రెగ్యులర్ గా నెలకి ఒకసారి ట్యాంక్ ని కచ్చితంగా శుభ్రం చేయాలి. వీటికి తగినంత ఆహారం మాత్రమే ఇవ్వాలి.
ఈ సియామీస్ చేపలు మాంసాహారాన్ని కూడా తింటాయి. ఈ చేపలకు ఆహారంగా మనం ఎరలను కూడా వేయవచ్చు. బెట్ట చేపలను టీవీ లేదా రేడియో లకు దూరంగా పెంచడం మంచిది. ఎందుకనగా వీటి ద్వారా వచ్చే సౌండ్స్ వల్ల అవి ఇంకా దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ట్యాంక్ నుంచి బయటకు రాకుండా పైన ఒక కప్పు ని ఏర్పాటు చేయడం మంచిది. ఎందుకంటే బెట్ట చేపలకు ఎత్తు ఎగిరే సామర్థ్యం కలిగి ఉంటాయి.