benefits of watermelon :
ఎవరైనా వేసవి వచ్చిందటే చాలు వాటర్ మిలన్ తింటుంటారు. వాటర్ మిలన్ ( benefits of watermelon ) సీజన్ లో మాత్రమే దొరికే ఫ్రూట్. వేసవిలో ఎండ వేడిమికి చాలా మంది డీహైడ్రేషన్ కి లోను అవుతుంటారు. ఈ డీహైడ్రేషన్ కి లోను అవ్వకుండా ఉండాలంటే వాటర్ కాని లేదా జ్యూస్ కానీ లేదా సలాడ్స్ గానీ తీసుకోవాల్సిందే. వాటర్ మిలన్ లో 92% శాతం నీరు ఉంటుంది. వాటర్ మిలన్ లో ఎక్కువ శాతం నీరు ఉంటుంది కాబట్టి వేసవి లో అందరూ వాటర్ మిలన్ ని తింటారు. వాటర్ మిలన్ ని కట్ చేసి గా కానీ , లేదా జ్యూస్ రూపంలో లేదా సలాడ్స్ రూపంలో గానీ తీసుకోవచ్చు. పుచ్చకాయ రుచి చాలా రుచి గా ఉంటుంది. పుచ్చకాయ జ్యూస్ ని మనం ఇంట్లో నే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
పుచ్చకాయ ( benefits of watermelon ) చుడటానికి లోపలి భాగం లో ఏరుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే పుచ్చకాయలో లైకోపిన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది ఎరుపు రంగు లో ఉంటుంది. పుచ్చకాయలో విటమిన్ సి , విటమిన్ ఎ మరియు బయోటిన్ ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. అందుకే వేసవి లో పుచ్చకాయను ఎక్కువగా తింటారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 1200 రకాల పుచ్చకాయల్ని పండిస్తున్నారు. అనార్కలి ,నందారి , రెడ్ టైగర్ , అల్ స్వీట్ , వాల్ పెయింట్ మరియు నూర్జహాన్ తదితర రకాల పుచ్చకాయలను పండిస్తున్నారు.
పుచ్చకాయలో పోషక విలువలు : Neutrient values in watermelon
పుచ్చకాయలో ( benefits of watermelon ) ఎక్కువ శాతం నీరు ఉంటుంది. దాదాపుగా పుచ్చకాయలో 92 % నీరు ఉంటుంది. పుచ్చకాయ డీహైడ్రేషన్ భారిన పడకుండా కాపాడుతుంది. పుచ్చకాయ లో కెరోటినాయిడ్స్ , బీటాకెరోటిన్ లు, విటమిన్ సి , విటమిన్ ఎ , విటమిన్ బి6 , పొటాషియం మరియు బయోటిన్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో గ్లూకోజ్ , ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్ కూడా ఉంటాయి.
పుచ్చకాయ ఉపయోగాలు : benefits of watermelon
1.పుచ్చకాయలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది కాబట్టి వేసవిలో డీహైడ్రేషన్ భారిన పడకుండా కాపాడుతుంది.
2.కిడ్నీ సంబంధిత వ్యాధుల భారినపడ్డవారు ఈ పుచ్చకాయ ని తేనె తో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
3.క్యాన్సర్ భారిన పడకుండా ఉండాలంటే పుచ్చకాయను తినాల్సిందే. ఎందుకంటే క్యాన్సర్ భారిన పడకుండా పుచ్చకాయ కాపాడుతుంది.
4.కీళ్ల నొప్పుల సమస్య మరియు వాతంతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు పుచ్చకాయ తింటే కీళ్ల నొప్పులను, వాతం ని తగ్గిస్తుంది.
5.కిడ్నీ లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు పుచ్చకాయ ని తింటే మంచి ఫలితం ఉంటుంది.
6.విరేచనాలు, కడుపునొప్పి, ఉబ్బరం మరియు ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నవారు పుచ్చకాయ తింటే చాలా సులభంగా తగ్గిపోతుంది.
7.అధిక రక్త పోటు మరియు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు పుచ్చకాయ తింటే అధిక రక్త పోటు ని తగ్గిస్తుంది.
8.ప్రెగ్నెన్సీ తో ఉన్న మహిళలు పుచ్చకాయ ని తింటే పుట్టే బిడ్డ చాలా ఆరోగ్యంగా పుడుతుంది.
9.ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది మన శరీరములో రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.
10.పుచ్చకాయలో విటమిన్ బి 6 ఉంటుంది కాబట్టి ఇది శరీరములో ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచుతుంది.
11.రక్త నాళాల్లో చెడు కొవ్వు చేరుకుని గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. పుచ్చకాయ తింటే ఈ చెడు LDL cholesterol ని కరిగించి గుండె పదిలంగా ఉండేలా చేస్తుంది.
12.రోజు పుచ్చకాయ తినడం వల్ల మలబద్దక సమస్యని కూడా తొలగిస్తుంది.
13.పుచ్చకాయ తినడం వల్ల చర్మం ఆరోగ్య వంతంగా ఉంటుంది. అంతేకాకుండా చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.