HomeMovie ReviewsParadise movie review : హీరో నాని నటించిన ప్యారడైజ్ సినిమా రివ్యూ

Paradise movie review : హీరో నాని నటించిన ప్యారడైజ్ సినిమా రివ్యూ

Paradise movie review :

హీరో నాచురల్ స్టార్ నాని నటించిన ” ప్యారడైజ్ ( paradise) ” సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ఈరోజు విడుదల అయ్యింది. ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించగా, కాయదు లోహర్ ఈ సినిమాలో నాని పక్కన కథానాయికగా నటించింది. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని అందించారు. అంతేకుండా ఈ సినిమాలో ఎషనాగుల ఫోక్ సాంగ్ లో నాని తో హీరోయిన్ కీర్తి సురేశ్ స్టెప్పులు వేశారు. ఈ పాట ( paradise movie review ) సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ ను సృష్టించింది. ఈ పాటని ఆట సందీప్ డాన్స్ కోరియోగ్రఫీ చేశారు. ఈ పాట విడుదల అయిన కొద్ది క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.

కథ : ( paradise movie review )

మన ఇండియా కి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ ప్రాంతం లోని ప్యారడైజ్ మాత్రం సంపన్నుల ఆధీనంలో అనగా మోహన్ బాబు ఆధీనంలో ఉంటుంది. ప్యారడైజ్ ప్రాంతంలో నివసిస్తున్న సవారీ జాతి వాళ్ళకి మాత్రం సరైన గుర్తింపు మాత్రం ఉండదు. సవారీ జాతికి చెందిన సమ్మక్క మాత్రం వాళ్ళకి గుర్తింపు ఉండాలని మోహన్ బాబు కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటుంది. సమ్మక్క కొడుకు అయిన నాని ( జడలు ) చిన్నపుడు జరిగిన ఒక సంఘటన కారణంగా మాలిక్ ( మోహన్ బాబు ) తో మరియు తన తల్లిపై కోపం పెంచుకుంటాడు.

నాని ఒక హత్య చేసి జైలు కి వెళ్తాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత msi నాని జైలు నుంచి విడుదల అవుతాడు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాని , మాలిక్ పై మరియు మాలిక్ కొడుకు పై పగ తీర్చుకోవాలి అనుకుంటాడు .. నాని మాలిక్ పై పగ తీర్చుకున్నాడా ? లేదా ? నాని తన తల్లిపై కోపం ఎందుకు పెంచుకున్నాడు అని తెలుసుకోవాల్సి అనుకుంటే సినిమా చూడాల్సిందే …!

Paradise movie review

విశ్లేషణ :

హీరో నాని జడలు జమానా పాత్రలో చాలా చక్కగా నటించాడు. ఈ సినిమాలో ఎక్కువ వయోలెన్స్ మాత్రమే ఉంటుంది. ఇది కొంత మైనస్ పాయింట్ అయింది సినిమాకి , కానీ హీరో నాని వయోలెన్స్ పాత్రలో నటించి ప్రేక్షకులని మెప్పించాడు. హీరోయిన్ కాయదు లోహర్ పర్వాలేదు అనిపించింది. మోహన్ బాబు విలన్ పాత్రలో శికంజ మాలిక్ గా చాలా బాగా నటించాడు. మోహన్ బాబు తన డైలాగ్ డెలివరీ తో , గంభీరమైన పాత్రలో చాలా బాగా నటించారు. ఇక ఈ సినిమాలో సోనాలి హీరో నాని తల్లిగా నటించారు.

తనదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. సంపూర్ణేష్ బాబు కూడా తన నటనతో పర్వాలేదు అనిపించాడు. ఈ సినిమా సాంకేతికంగా చాలా బాగుంటుంది. కానీ కథ మాత్రం కొంత రొటీన్ గా అనిపిస్తుంది. అనిరుధ్ సంగీతం ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం . అంతేకాకుండా ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది అని చెప్పొచ్చు. దర్శకుడు రొటీన్ కథ తో సినిమా ను తెరకెక్కించిన కొంత మదర్ సెంటిమెంట్ మరియు పాటలు , వయోలెన్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు.

Telugusitara rating : 2.5/5

RELATED ARTICLES
LATEST ARTICLES