HomemoviesVimala raman : వినయ్ రాయ్ తో విమలా రామన్ ప్రేమ రామాయణం

Vimala raman : వినయ్ రాయ్ తో విమలా రామన్ ప్రేమ రామాయణం

Vimala raman :

ఎవరైనా ఎప్పుడైనా తెలుగు సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయం అయిన విమలా రామన్ ( vimala raman ) ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు తమిళ, తెలుగు మరియు మలయాళీ చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించుకుంది. ఆ తర్వాత ఆఫర్లు సరిగా లేకపోవడం వల్ల కొన్ని రోజులు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. కానీ తన్ అందంతో మరియు నటనతో ప్రేక్షకులను మెప్పించింది.ఆస్ట్రేలియా లో భారత సంతతికి చెందిన కుటుంబంలో విమలా రామన్ జన్మించారు. తర్వాత నటన మీద విమలా రామన్ కి మక్కువ ఉండటం తో సినిమాలో ట్రై చేసారు. మొదటగా విమలా రామన్ తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.

తన నటన మరియు అందంతో తనకు తెలుగు లో కూడా బాగానే అవకాశాలు వచ్చాయి. విమలా రామన్ ( vimala raman ) తెలుగు లో ఎవరైనా ఎప్పుడైనా, నువ్వా నేనా, చట్టం , గాయం వంటి మూవీ లలో నటించారు. ఆ తర్వాత ఆఫర్లు లేక కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ నీ గత ఏడాది నుంచి స్టార్ట్ చేశారు. గత ఏడాది రిలీజ్ అయిన గాండివ దారి చిత్రం లో విమలా రామన్ నటించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో విమలా రామన్ ఒక ముఖ్య పాత్రలో నటించారు.

విమలా రామన్ కి ( vimala raman age ) 42 ఏళ్లు అయినా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. కానీ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు అయిన వినయ్ రాయ్ తో అమ్మడు ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళు ఇద్దరు ప్రేమలో పడ్డారని బి టౌన్ లో గుస గుసలు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ళు ఇద్దరు vv పేరుతో తాజా గా ఒక ఫోటో షూట్ కూడా చేస్తున్నారు. దాంట్లో వీళ్ల క్లోజ్ నెస్ చూసి వీళ్ళు ఇద్దరు ప్రేమలో పడ్డది నిజమే అని బలంగా నమ్ముతున్నారు. ఏది ఏమైనా ఇంకా విమలా రామన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే ?

RELATED ARTICLES
LATEST ARTICLES