manaiyadi sastram in telugu : manaiyadi sasthiram
మనం ఏదైనా ఇల్లు కట్టాలి అనుకున్న లేదా ఇంకా ఏమైనా ఆఫీస్ లు గానీ కట్టాలి అనుకున్నపుడు వాస్తు శాస్త్రము ని కచ్ఛితంగా అనుసరిస్తారు. ఒకప్పుడు వాస్తు శాస్త్రము ని ఎవరు ఎక్కువగా పాటించేవారు కకపోయేది కానీ ఈ మధ్య ఎక్కువగా వాస్తు శాస్త్రము ని నమ్ముతున్నారు. ఈ వాస్తు శాస్త్రం లో చాలా శాస్త్రాలు ఉన్నాయి. అందులో ఒకటి మానైయాడి వాస్తు శాస్త్రం ( manaiyadi sastram ).
ఈ మానైయాడి శాస్త్రం లో ( manaiyadi sastram ) ఇల్లు ఎంత చదరపు అడుగుల్లో నిర్మించాలి ? మనం నిర్మించే గది ఎంత వెడల్పుగా ఉండాలి ? ఆ గది యొక్క గోడలు ఎంత ఎత్తులో ఉండాలి ? అంతేకాకుండా మనం కట్టే ఇంట్లో మొత్తం ఎన్ని గదులు వుండాలి ? ఇలా మొత్తం సమాచారం అంత మానైయాడి వాస్తు శాస్త్రము లో ఉంటుంది. దీన్ని తమిళ్ వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు.
మానైయాడి శాస్త్రం ని ( manaiyadi sastram ) ఎందుకు ఎక్కువగా నమ్ముతారు అంటే ఇల్లు ని కట్టేటపుడు వాస్తు శాస్త్రం ని అనుసరించి కడితే ఇంట్లో సంపద వస్తుందని అంతేకాకుండా ఇంట్లో నివసించే ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రము ని నమ్మి ఇల్లు కడితే ఇంట్లో నివసించే వాళ్ళు ఒకరికి ఒకరు గొడవపడకుండా శాంతియుతంగా నివసిస్తారు అని ఒక నమ్మకం.
మానైయాడి వాస్తు శాస్త్రం ( manaiyadi sastram ) ప్రకారం ఇంటిని ఎప్పుడు పడితే అప్పుడు నిర్మించకూడదు. ఒక వేళ మీరు ఇంటిని నిర్మించాలి అనుకుంటే వైకాసి మాసం లో మే నెల 15 వ తారీఖు నుంచి జూన్ నెల 15 వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో గనుక మీరు ఇంటిని నిర్మిస్తే ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి అవుతుంది మరియు ఇంట్లో ఉండే వాళ్ళు సుఖ సంతోషాలతో జీవిస్తారు.
ఒకవేళ మీరు అవని మాసం ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో గనుగ ఇంటిని నిర్మిస్తే ఇంట్లో ఉండే వాళ్ళు సంపదతో , సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఒకవేళ మీరు కార్తిగై మాసం లో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మరియు మార్గశి మాసంలో డిసెంబర్ 15 నుంచి జనవరి 15 మధ్యలో ఇంటిని నిర్మిస్తే సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించడమే కాకుండా మరియు దైవ అనుగ్రహం కూడా కలుగును. manaiyadi sasthiram

మానైయాడి శాస్త్రం ప్రకారం ఎన్ని అడుగులు మరియు ఎత్తు ఉండాలి ? ఎలా ఉంటే మంచిది ? ఎలా ఉంటే మంచిది కాదు అనే విషయం క్రింద తెలిపిన వివరాలని చదవండి : manaiyadi sastram in telugu
| అడుగులు | పరిణామాలు |
| 6 | ఇంట్లో ఉండే వాళ్లు ప్రశాంతమైన జీవితం ని గడుపుతారు |
| 7 | సంపద మొత్తం పోగొట్టుకుంటారు |
| 8 | గొప్ప సంపద మరియు అన్ని భోగాలను అనుభవిస్తారు |
| 9 | సంపద మొత్తం పోగొట్టుకుని ఇంకా చాలా కష్టాల పాలు అవుతారు |
| 10 | నివాసి కనీసం ఒక పూట భోజనం చేస్తారు |
| 11 | సంపద మరియు ఆరోగ్యాన్ని నివాసి అనుభవిస్తారు |
| 12 | తన సంతానాన్ని నివాసి కోల్పోతారు |
| 13 | రోగాల భారిన పడతారు |
| 14 | నివాసి ప్రశాంతతని కోల్పోతాడు |
| 15 | కుటుంబంలో మరణిస్తారు |
| 16 | చాలా సంపాదనను పొందుతాడు |
| 17 | తన చిరకాల శత్రువులని నివాసి వోడిస్తాడు |
| 18 | నివాసి ఇల్లు త్వరగా నాశనం అవుతుంది |
| 19 | ఇంట్లో ఉండే వాళ్లు పేదరికాన్ని అనుభవిస్తారు |
| 20 | సంతోషకరమైన జీవితం ని గడుపుతారు |
| 21 | నివాసి ఇంట్లో వాళ్ళు గౌరవంగా జీవిస్తాడు |
| 22 | నివాసి ఇంట్లో వాళ్ళు తన శత్రువుని వొడిస్తాడు |
| 23 | ఇంట్లో చెడు సంఘటనలు జరుగుతాయి |
| 24 | లాభాలు మాత్రం ఆశిస్తారు |
| 25 | ఓనర్ తన భార్యని కోల్పోతారు |
| 26 | శ్రేయస్సు కలుగుతుంది |
| 27 | ధనవంతులు అవుతారు |
| 28 | దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు |
| 29 | అన్ని రకాల సంపదలతో జీవిస్తాడు |
| 30 | లక్ష్మి దేవత అనుగ్రహిస్తుంది |
| 31 | కొన్ని ప్రయోజనాలను మాత్రమే అనుభవిస్తాడు |
| 32 | ఇది వరకు నివాసి కోల్పోయిన సంపద మళ్ళీ తిరిగి వస్తుంది |
| 33 | శ్రేయస్సు తో ఆశీర్వ దించబడతాడు |
| 34 | తన ఇంటిని కాళీ చేసి వేరే ఇంట్లో ఉండాల్సి వస్తుంది |
| 35 | ధనవంతుడు అవుతాడు |
| 36 | ఇంటి నివాసి ధైర్యంగా నివసిస్తాడు |
| 37 | మంచి సంతానం కలుగుతుంది మరియు సంపద తో జీవిస్తాడు |
| 38 | దెయ్యం నివాసి ని వెంటాడుతుంది |
| 39 | శ్రేయస్సు కలుగుతుంది |
| 40 | శత్రువుల కారణముగా తన ఆస్తిని కోల్పోతాడు |
| 41 | కొన్ని సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి |
| 42 | సంపదతో జీవిస్తాడు |
| 43 | ఇబ్బందులతో బాధపడుతుంటారు |
| 44 | నివాసి గుడ్డివాడు అవుతాడు |
| 45 | సంతానం కలుగుతుంది |
| 46 | శ్రేయస్సు ని కోల్పోతారు |
| 47 | చెడు ప్రదేశం లో ఉంటారు |
| 48 | అగ్ని ప్రమాదం జరుగును |
| 49 | పేదరికం |
| 50 | మంచి మరియు చెడు ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతాడు |
| 51 | అనవసర వివాదాలు |
| 52 | మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తాడు |
| 53 | స్త్రీ లతో వివాదాలు |
| 54 | ఇంటి ఓనర్ ప్రభుత్వ ఆగ్రహం కి గురి అవుతారు |
| 55 | బంధువులు సహాయం చేస్తారు |
| 56 | సంతాన భాగ్యం కలుగును |
| 57 | పిల్లలు కలగరు |
| 58 | నివాసి ప్రాణాలకి ముప్పు |
| 59 | ఆర్థిక ఇబ్బందులు |
| 60 | తను ఎంచుకున్న వృత్తిలో ముందుకి సాగుతారు |
| 61 | అనవసర వివాదాలు ఎదుర్కుంటారు |
| 62 | పేదరికం మరియు వ్యాధులతో బాధపడుతుంటారు |
| 63 | వివాదాలలో విజయం కలుగును |
| 64 | అన్ని విలాసాలను అనుభవిస్తాడు |
| 65 | భార్యని కోల్పోతాడు |
| 66 | శ్రేయస్సు కలుగును |
| 67 | ఇంట్లోకి దెయ్యం వస్తుంది |
| 68 | ఒక నిధిని బయటకు తీస్తాడు |
| 69 | దొంగల నుండి ప్రమాదం |
| 70 | ఇంటి నివాసి ప్రసిద్ధుడు అవుతాడు |
| 71 | ప్రభుత్వ రంగంలో ఉన్నత స్థాయి కి చేరుకుంటాడు |
| 72 | ఇంటి నివాసి జ్ఞానం ని పొందుతాడు |
| 73 | పిల్లలు ఉండరు |
| 74 | ప్రభుత్వం నుంచి ఆదరణ పొందుతారు |
| 75 | సంపదని కోల్పోయి మరియు చనిపోవచ్చు |
| 76 | బంధువుల నుంచి ఇబ్బందులు |
| 77 | కొత్త వాహనం కొనుగోలు |
| 78 | కుమార్తెకు సమస్యలు |
| 79 | ఐశ్వర్యం కలుగుతుంది |
| 80 | సంపదలకు అధిపతి నివాసి ఇంట్లో నివసిస్తాడు |
| 81 | యజమానికి ముప్పు |
| 82 | ప్రకృతి నుంచి ముప్పు |
| 83 | నివాసి సంతోషాన్ని కోల్పోతాడు |
| 84 | సుఖంగా జీవిస్తారు |
| 85 | అన్ని విలాసాలు అనుభవిస్తారు |
| 86 | ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు |
| 87 | వాహన యోగం కలుగును |
| 88 | సంక్షేమం తో జీవితాన్ని గడుపుతారు |
| 89 | ఇంటిని కొనుగోలు చేస్తారు |
| 90 | అన్ని రంగాల్లో అభివృధి |
| 91 | ఇంటి నివాసి చాలా జ్ఞానవంతుడు |
| 92 | అవార్డులు మరియు అధికారాలను గెలుచుకుంటాడు |
| 93 | నివాసం ని మార్చుకోవాల్సి వస్తుంది |
| 94 | పేదరికం కలుగును |
| 95 | సెలబ్రిటీ అవుతాడు |
| 96 | ఖర్చులు పెరుగుతాయి |
| 97 | అంతర్జాతీయ వ్యాపారం లో అభివృద్ధి |
| 98 | విదేశి ప్రయాణం |
| 99 | అదృష్టం కలుగును |
| 100 | విద్యావంతులు అవుతారు |
| 101 | భారీ సంపద కలుగుతుంది |
| 102 | స్నేహితుల సహాయంతో కలుగును |
| 103 | ఇంట్లోఉండే నివాసి దోషిగా పేరు వస్తుంది |
| 104 | వ్యాపారం లో లాభం ఉండదు |
| 105 | ఇంట్లో ఉండే నివాసి కుమార్తె వ్యాధితో భాధపడును |
| 106 | ధనవంతుడు అవుతారు |
| 107 | భారీ సంపదని కూడ బెడతాడు |
| 108 | ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు |
| 109 | శ్రేయస్సు కలుగుతుంది |
| 110 | సంపదల దేవుడు ఇంటిని ఆశీర్వదిస్తాడు |
| 111 | సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి |
| 112 | కోల్పోయినఆస్తినితిరిగి పొందుతాడు |
| 113 | సంపదన ని పోగుచేస్తాడు |
| 114 | భవిష్యత్తులో స్థలం మార్పు |
| 115 | సంపదల దేవుడు నివాసి ఇంటిని ఆశీర్వదిస్తాడు |
| 116 | సమాజంలో గౌరవం |
| 117 | నివాసి ధనవంతుడు అవుతాడు |
| 118 | పేదరికం తో బాధపడుతుంటారు |
| 119 | భారీ సంపదన ని కూడబెడతాడు |
| 120 | ఇంటి నివాసి తన సంపాదించిన మొత్తం ని కోల్పోతాడు |
