HomeMovie ReviewsCoolie movie review : రజనీకాంత్ నటించిన కూలీ సినిమా రివ్యూ

Coolie movie review : రజనీకాంత్ నటించిన కూలీ సినిమా రివ్యూ

Coolie movie review :

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ” కూలీ ” ఈరోజు భారీ అంచనాలతో దేశ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాకి ప్రముఖ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన లోకేష్ కనాగరాజ్ దర్శకత్వం వహించారు. లోకేష్ కనాగరాజ్ ఇది వరకు తీసిన ఖైదీ, లియో మరియు విక్రమ్ మూవీ లు భారీ హిట్ నీ సొంతం చేసుకోవడం తో ఈ మూవీ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో మన తెలుగు హీరో నాగార్జున కూడా నటించారు. అంతేకాకుండా హీరో ఉపేంద్ర మరియు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మరియు షోబిన్ కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో శృతి హాసన్ కూడా నటించింది. ఈ సినిమాలో అందరూ హీరో లు ఉండటం తో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అంతేకాకుండా ఈ సినిమాలో పూజ హెగ్డే మరియు సత్యరాజ్ కూడా నటించారు.

స్టోరీ ( Story ) :

ఈ సినిమా లో నాగార్జున సైమన్ పాత్రలో నటించారు. నాగార్జున వైజాగ్ లో కింగ్ పిన్ లాజిస్టిక్ పేరుతో డాన్ గా చలామణి అవుతుంటారు. అయితే ఈ లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ముసుగులో నాగార్జున కాస్ట్లీ వాచీలు మరియు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు వేరే దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే వీటితో పాటు కొన్ని చేయకూడని వాటిని కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఇదంతా షోబిన్ ( దయాల్ ) చూసుకుంటాడు.

అయితే వీళ్ళ దగ్గర పనిచేసే సత్యరాజ్ ( రాజశేఖర్ ) సడన్ గా చనిపోతారు. ఈ విషయం రజనీకాంత్ కి ( దేవా ) తెలుస్తుంది. రజనీకాంత్ మరియు సత్యరాజ్ మంచి స్నేహితులు. ఈ చనిపోయిన విషయం తెలుసుకున్న రజనీకాంత్ తన రివెంజ్ నీ తీసుకోవడానికి ఏం చేశాడు ? తన ఫ్రెండ్ ఎలా చనిపోయాడు అని తెలుసుకున్నాడా ? లేదా ? అని తెలుసుకోవాలి అనుకుంటే మూవీ చూడాల్సిందే …!

Coolie movie

పెర్ఫార్మెన్స్ ( Performance ) :

ఈ సినిమాలో అందరూ తమ తమ పాత్రలకి న్యాయం చేశారు. ఈ సినిమా లో మెయిన్ హైలెట్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. కథ కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది. అంతేకాకుండా ట్విస్ట్ లు కూడా మనం ముందుగానే కనిపెట్టవచ్చు. శోభిన్ తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నాగార్జున డాన్ గా అంతగా మెప్పించలేకపోయారు. డైరెక్టర్ అమీర్ ఖాన్ పాత్ర కి సరిగా స్టోరీ లేకుండా పోయింది. ఒకే సినిమాలో స్టార్ లు ఎక్కువ అయ్యేసరికి ఒక్కొక్కరికి ఇంపార్టెన్స్ ఎంచుకుంటూ పోవాల్సి వచ్చింది.

ఈ సినిమాకి ఎల్ సియు కి సంబంధమే లేదు. ఇది కంప్లీట్ గా ఒక డిఫరెంట్ రివెంజ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో డాన్స్ మరియు మ్యూజిక్ చాలా బాగున్నాయి. మౌనిక సాంగ్ హిట్ కావడం తో ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమా లో గ్లామర్ బ్యూటీ పూజ హెగ్డే మరియు శృతి హాసన్ తమ నటన తో పర్వాలేదు అనిపించారు. ఎక్కువ మంది స్టార్ లు అవ్వడం ఈ సినిమాకి చాలా పెద్ద మైనస్ పాయింట్ అయింది మరియు అంతేకాకుండా కథలో బలం లేకపోవడం ఇంకా పెద్ధ మైనస్ పాయింట్ అయింది.

ఈ సినిమా సోషల్ మీడియాలో లో హైప్ ఎక్కువ రావడం తో భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు కానీ కొంత రొటీన్ స్టోరీ వల్ల ఈ సినిమా చివరకు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Movie Rating : 2.5/5

RELATED ARTICLES
LATEST ARTICLES