Irumudi movie review in telugu :
మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి సినిమా irumudi movie review in telugu ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 21 న విడుదల అయ్యింది. చిత్ర యూనిట్ ఇది వరకు మల్లె పూల సాంగ్ ను విడుదల చేశారు దీని ద్వారా ఈ సినిమా కి మరింత హైప్ ను తెచ్చి పెట్టింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో రవితేజ కి సరైన హిట్ కూడా లేదు ఈ సినిమా హిట్ కొడుతుందని భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రియ భవాని శంకర్ కథానాయికగా నటించారు. బేబీ నక్షత్ర ఈ సినిమాలో రవితేజ కూతురిగా నటించింది. ఈ సినిమా కి శివ నిర్వహణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ మ్యూజిక్ ను అందించారు.
కథ : irumudi movie review in telugu
ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ అయ్యప్ప దీక్ష తీసుకున్న తండ్రి పాత్రలో నటించారు. రవితేజ ఈ సినిమాలో ఒక అరటి పండ్ల వ్యాపారం చేసే పాత్రలో నటించారు. ఈ సినిమాలో రవితేజ పేరు త్రినాథ్. త్రినాథ్ పండ్ల వ్యాపారం చేస్తూ పొల్లూరు అనే ఒక గ్రామంలో నివసిస్తుంటారు. త్రినాథ్ కి ఒక కూతురు ఉంటుంది తనే బేబీ నక్షత్ర. అయితే త్రినాథ్ కి తన కూతురు అంటే చాలా ఇష్టం. అయితే తన కూతురికి చిన్నపాటి నుంచే త్రినాథ్ ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి, అసత్యం అసలు మాట్లాడకూడదు, అంతేకాకుండా సత్యాన్ని మాట్లాడటానికి ఎప్పుడూ భయపడద్దు ఏ సందర్భంలో అయిన సత్యమే మాట్లాడాలి అని చిన్నప్పటి నుంచి తన కూతురికి చెప్తుంటాడు.
అయితే వీళ్ళ చుట్టూ పక్కల ఒక నేరగాళ్ల ముఠా ఒకటి అమ్మాయిలని ఇబ్బంది పెడుతుంటారు. దీని వల్ల త్రినాథ్ కి ఒక ఊహించని సంఘటన ఎదురు అవుతుంది. త్రినాథ్ తన కూతురికి చెప్పిన మంచి మాటలే వాళ్ళకి ఒక తీవ్రమైన పరిస్థిలోకి నెట్టి వేస్తుంది. ఏంటి ఆ పరిస్థితి ..? చివరికి త్రినాథ్ ఏం చేశారు ? అనేది తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే …!

విశేషణ :
ఈ సినిమాలో రవితేజ తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. రవితేజ అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తుని పాత్రలో చాలా బాగా నటించాడు. అంతేకాకుండా బేబీ నక్షత్ర ఈ సినిమాలో చాలా బాగా నటించింది. శివ నిర్వహణ తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న ప్రేమని చాలా బాగా చూపించాడు. కొన్ని సన్ని వేషాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఈ సినిమాలో దర్శకుడు శివ నిర్వహణ త్రినాథ్ పాత్రని చాలా చక్కగా తీర్చిదిద్దారు.
త్రినాథ్ తాగుబోతు అయినా, తనకంటూ కొన్ని విలువలు ఉంటాయి. ఏ అమ్మాయికి అన్యాయం జరిగిన తను సహించడు. ఊర్లో ప్రతి అమ్మాయిని తన సొంత కూతురిలా భావిస్తాడు. ఫస్ట్ హాఫ్ కొంచం స్లో గా ఉన్నపటికీ , సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ తో చాలా ఆసక్తి కారంగా ఉంటుంది. ఈ సినిమా లో హీరోయిన్ మరియు అజయ్ పాత్ర కూడా చాలా బాగుంటుంది. జీవి ప్రకాశ్ కూడా మ్యూజిక్ ను సన్నివేశాలకు తగ్గట్టుగా చాలా బాగా అందించారు.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ నటన
క్లైమాక్స్
తండ్రి కూతుళ్ల మధ్య ప్రేమ
కథ
దర్శకత్వం
బేబీ నక్షత్ర నటన
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ కొంచం నెమ్మదిగా ఉంటుంది
కొన్ని సన్ని వేషాలు ముందే ఊహించ తగ్గట్టుగా ఉండటం
Telugusitara.com rating : 4/5
Also read : ఓటీటీలో సందడి చేయనున్న 19 సినిమాలు ఇవే








