HomeHealthPomfret fish : పాంఫ్రేట్ చేప తో ఆరోగ్య ప్రయోజనాలు

Pomfret fish : పాంఫ్రేట్ చేప తో ఆరోగ్య ప్రయోజనాలు

Pomfret fish :

నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే ఆహారాల్లో ఒకటి చేపలు. చేపలలో చాలా రకాలు ఉంటాయి. అందులో ఎక్కువగా తినే చేపల ల్లో ఒకటి పాంఫ్రేట్ చేప. ఈ చేపకు ఎక్కువగా ముళ్ళు లు ఉండవు. ఈ పాంఫ్రేట్ చేపకు ఒక ముళ్ళు మాత్రమే ఉంటుంది. ఎక్కువగా ముల్లులు ఉండవు కాబట్టి ఈ చేపని చాలా సులభంగా తినవచ్చు. అందుకే ఈ చేపని ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. ఎక్కువగా ముళ్ళు లు ఉన్న చేప తినేటపుడు జాగ్రత్త గా చూసి తినాలి ఎందుకంటే ముల్లులు గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చేపలు తినేటపుడు జాగ్రత్తగా ఉండాలి.

ఈ పాంఫ్రేట్ చేపకు ఒకటే ముళ్ళు ఉండటం వల్ల ఈ చేప నీ ఎక్కువగా ఫ్రై చేసుకుని తింటారు. ఈ చేప వంటకాలు ఎక్కువగా రెస్టారెంట్ లో మాత్రమే దొరుకుతాయి. ఈ పాంఫ్రేట్ చేపలతో చేసిన వంటకాలు చ రుచిగా ఉంటాయి. ఈ పాంఫ్రేట్ చేపలు రెండు రకాలు. ఒకటి తెల్ల పాంఫ్రేట్ చేప ( white pomfret fish ) మరియు ఇంకోటి నల్ల పాంఫ్రేట్ చేప ( black pomfret fish ). వీటి రంగులు మాత్రమే తేడా ఉంటాయి గానీ రుచి లో మాత్రం ఎలాంటి పెద్ద తేడా మాత్రం ఉండదు. ఈ పాంఫ్రేట్ చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Pomfret fish in telugu

పాంఫ్రేట్ చేపకు మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. ఈ చేప మార్కెట్ లో మంచి ధర పలుకుతుంది. ఈ పాంఫ్రేట్ చేప ఒక kg కి 1000 రూపాయలుగా ఉంది. ఈ చేప చూడటానికి వజ్రకారం లో ఉంటుంది. దీని చేప ఆకారం వల్ల చాలా సులభంగా ఈ చేపని మనం గుర్తించవచ్చు. ఈ చేప సుమారుగా 18 నుంచి 40 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఈ చేప సుమారుగా 4 నుంచి 5 కిలోల వరకు పెరుగుతుంది. పాంఫ్రేట్ ఫిష్ ను తెలుగు లో చందువా చేప sanduva fish ( pomfret fish in telugu ) అని పిలుస్తారు.

pomfret fish in malayalam

pomfret fish in marathi

Health benefits of pomfret fish : పాంఫ్రేట్ చేపలతో ఆరోగ్య ప్రయోజనాలు

  1. పాంఫ్రేట్ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మెదడు పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.
  2. పాంఫ్రేట్ చేపలో విటమిన్ డి, విటమిన్ ఎ, విటమిన్ 12 , అయోడిన్ మరియు సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
  3. పాంఫ్రేట్ చేపలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది.ఇది శరీర కండరాల పెరుగుదల కి ఉపయోగపడుతుంది.
  4. పాంఫ్రేట్ చేపలో విటమిన్ డి మరియు భాస్వరం ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దంతాలు కూడా దృఢంగా ఉండేలా చేస్తుంది.
  5. పాంఫ్రేట్ చేపలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దృష్టి సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
RELATED ARTICLES
LATEST ARTICLES