Bombay duck fish :
చేపలు మన శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. చేపలలో ఎక్కువగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చేపలలో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒక రకమే ఈ బొంబాయి డక్ చేప ( bombay duck fish ). ఈ చేపని బాంబిల్ ( bombil fish ) చేప అని కూడా పిలుస్తారు. ఈ బొంబాయి డక్ చేప ఎక్కువగా ఇండో పసిఫిక్ సముద్రంలో ఎక్కువగా కనిపిస్తుంది. దిన్ని మన భారతదేశంలో ఎక్కువగా తింటారు. ఈ చేప ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఈ బొంబాయి డక్ చేప యొక్క శాస్త్రీయ నామం హర్పాడాన్ నెహెరియస్. ఈ చేప చూడటానికి పొడవుగా ఉంటుంది. ఈ చేపని బాంబే బాతు ( bombay bathu ) మరియు బొమ్మలో ( bommalo ) అని కూడా పిలుస్తారు. ఈ చేపలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మరియు తక్కువగా కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా ఈ చేపని వింత చేప అని కూడా పిలుస్తారు. ఈ చేప చూడటానికి చిన్నగా బల్లి ల ఉంటుంది మరియు పొడవు ఆకారం లో ఉంటుంది. ఈ చేప పరిమాణం 25 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఈ చేపని ఎండ బెట్టి కూడా వంటకాల్లో వాడతారు.
బొంబాయి డక్ చేప లో ఎక్కువగా ప్రోటీన్ మరియు తక్కువ కొవ్వు ఉంటుంది అంతేకాకుండా ఈ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, కాల్షియం, భాస్వరం ,అయోడిన్ మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. మార్కెట్ లో ఈ చేప కి మంచి ధర పలుకుతుంది. ఈ బొంబాయి డక్ చేప Bombay duck fish price 1kg ధర మార్కెట్ లో సుమారు 500 రూపాయలు ఉంది.

బొంబాయి డక్ చేప యొక్క ఆరోగ్య ప్రయోజనాలు : Bombay duck fish benefits
- బొంబాయి డక్ చేప లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీర పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
- బొంబాయి డక్ చేప లో ఎక్కువగా కాల్షియం మరియు భాస్వరం ఉంటుంది. ఇది శరీరం లో ఎముకల పెరుగుదల కి ఎంత గానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది.
- బొంబాయి డక్ చేప లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయి ను పెంచుతుంది మరియు కండరాల పని తీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అలసట రాకుండా చూస్తుంది మరియు మెదడు పని తీరును కూడా మెరుగు పరుస్తుంది.
- ఈ బొంబాయి డక్ చేప లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె పని తీరును మెరుగుపరుస్తుంది. గుండె జబ్బు రాకుండా కాపాడుతుంది.
- బొంబాయి డక్ చేప లో అయోడిన్ ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంధి యొక్క పని తీరును మెరుగుపరుస్తుంది. తద్వారా థైరాయిడ్ లెవెల్ కూడా తగ్గుతుంది.