HomeHealthAloe Vera Benefits : కలబందతో అధ్బుతమైన అరోగ్య ప్రయోజనాలు

Aloe Vera Benefits : కలబందతో అధ్బుతమైన అరోగ్య ప్రయోజనాలు

Aloe vera benefits :

Aloe vera ని తెలుగులో కలబంద ( kalabandha ) అని పిలుస్తారు. కలబంద పచ్చటి ఆకులు మరియు ఆకులకి పక్కన ధృడమైన ముల్లులతో ఉంటుంది. ఈ కలబంద ఆకులు లోపలలో తెల్లటి గుజ్జుతో కూడి ఉంటుంది. ఈ కలబంద మొక్క కాక్టస్ జాతికి చెందనది. కలబంద అన్ని రకాల స్వాబావాలు కలిగి ఉంది. కలబంద ని చర్మం పై ఉపయోగించినప్పుడు చల్లగాను నోటితో తీసుకున్నపుడు చేదుగాను ఉంటుంది. అంతే కాదు ఇది ఆరోగ్య సమస్యను బట్టి తన గుణాన్ని మార్చుకొని సమస్యని తగ్గిస్తుంది.కలబంద వేడి ప్రదేశంలో ఎక్కువ పెరుగుతుంది. కానీ పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే కలబందని ఎలాంటి వాతావరణంలో అయిన పెంచుకోవచ్చు. కాబట్టి ఈ మొక్కని ప్రతి ఒక్కరూ తమ గార్డెన్ లో ఎక్కువ పెంచుకుంటారు. ఈ కలబంద మొక్క వలన చాలా రకాల ఉపయోగాలు ( aloe Vera Benefits ) ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది మరియు చర్మ సమస్యలని పరిష్కరించాడానికి అంతే కాకుండా వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యని తగ్గిస్తుంది.

కలబంద లో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. కలబందలో యాంటి సెప్టిక్ మరియు యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి క్యాన్సర్, యాంటి ఫంగల్ ఇలా అన్ని రకాల గుణాలు ఉన్నాయని ఆయుర్వేదిక్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి అన్ని సమస్యలను ఎదుర్కునే గుణం కలబంద కి పుష్కలంగా ఉన్నట్టు ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

కలబంద వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు : Health Benefits and uses of Aloe vera

1.చర్మ వ్యాధులకు కలబంద ఉపయోగాలు :
కలబందని దాదాపు అన్ని రకాల చర్మ సమస్యలకు వాడుతారు.
అందులో కొన్ని ముఖ్యమైనవి.
ఆక్నే : acne
ప్రస్తుతం ఉన్న పరిస్థులలో ఆక్నె అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒకరిని ఇబ్బంది పెట్టే సమస్యగా మారిపోయింది. ఈ సమస్య తగ్గించుకోవడానికి చాలా రకాల మందులను మరియు క్రీమ్ లను వాడుతూ ఉంటారు. కానీ వాటి వలన శాశ్వత పరిష్కారం ఉండదు. అలాంటి వారికి చక్కటి పరిష్కారం కలబంద. కలబంద గుజ్జును చర్మం పై ఆక్నే ఎక్కువగా ఉండే ప్రదేశంలో వారానికి రెండుసార్లు అయిన ఫేస్ ప్యాక్ లా వేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన కొన్ని రోజులకు మి ఆక్నీ సమస్యని తగ్గించుకోవచ్చు.

కాలిన గాయాలు :
కొందరికి కొన్ని పరిస్థితులలో చర్మం కాలడం జరుగుతుంది. అలాంటపుడు కాలిన గాయాలపై కలబందని లేపనం లా పెట్టాలి. ఇలా పెట్టడం వలన గాయం ఇన్ఫెక్షన్ రాకుండాను మరియు గాయం తొందరగా తగ్గిపోవడానికి కలబంద ఎంతో ఉపయోగపడుతుంది.


స్టెచ్ మార్క్స్:
ఆడవారిలో ఎక్కువగా గర్భం దాల్చి ప్రసవం అయ్యాక చర్మం పై ఏర్పడే సమస్య స్టెచ్ మార్క్స్. ఈ స్ట్రెచ్ మార్క్స్ వలన చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ స్టెచ్ మార్క్స్ పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా బాధపడేవారికి ఈ కలబంద చాలా బాగా పనిచేస్తుంది. కలబంద గుజ్జును ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచం రెండు చుక్కలు కొబ్బరి నూనే వేసి కలపండి. ఇ పేస్ట్ ని అక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో అక్కడ మాయిశ్చరైజర్ లా రోజు రాయడం వలన కొన్ని రోజులకు స్టెచ్ మార్క్స్ తగ్గుతాయని ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెబుతున్నారు.

మొటిమలు :
ఆడవారిలో అయిన మగవారిలో అయిన చర్మానికి సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య మొటిమలు మరియు మొటిమల వలన ఏర్పడే మచ్చలు ఇలా చెప్తూ వెళ్తే ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇలా మొటిమల వలన ఇబ్బంది పడే వారికి కలబంద ఒక చక్కటి మెడిసిన్ గా ఉయోగపడుతుంది. కలబంద గుజ్జును తీసుకొని పేస్ట్ లా కలిపి మొహం పై ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా కనీసం వారానికి మూడు సార్లు వేసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. అంతే కాకుండా మొటిమల వలన వచ్చే మచ్చలు కూడా రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.


చర్మం దురద మరియు అలర్జీ :
చాలా మందికి కొన్ని సార్లు చర్మం పై దురద రావడం కొన్ని సార్లు ఎదైన మనకు పడని పదార్థం తినడం వలన చర్మం పై అలెర్జీలు రావడం జరుగుతుంది. అలాంటపుడు ఎలాంటి భయం లేకుండా కలబంద ని దురద వచ్చే ప్రదేశంలో మరియు అలెర్జీలు వచ్చిన చర్మం పై కలబంద గుజ్జుని పేస్ట్ లా చేసి పెట్టాలి. ఇలా చేస్తే దురద మరియు అలెర్జీ తగ్గుతుంది. ఎందుకంటే కలబంద లో అధిక యాంటి సెప్టిక్ మరియు యాంటి బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఈ కలబంద మొక్క చర్మం పై ఏర్పడే అన్ని సమస్యలను తగ్గిస్తుంది.

ముడతలు:
కలబంద ని ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీమ్ రూపంలో వాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఈ కలబంద మొక్కలో మన చర్మానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందులో ఒకటి విటమిన్ E ఈ విటమిన్ మన చర్మం పై ముడతలు తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.


aloe vera benefits

2.వెంట్రుకలకు కలబంద ఉపయోగాలు :
కలబందని వెంట్రుకలకు సంబంధించిన సమస్యలకు వాడుతూ ఉంటారు. అందులో కొన్ని ముఖ్యమైనవి.
చుండ్రు నివారణ:
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మనిషికి వారి పర్సనల్ పరిస్థుల వలనో లేదా పొల్యూషన్ వలనో లేదా వారి ఆహారపు అలవాట్ల కారణం వలనో చుండ్రు సమస్య ఎక్కువగా బాధపెడుతుంది. ఒకసారి చుండ్రు వచ్చిందంటే అంత త్వరగా అస్సలు పోదు ఒకవేళ తగ్గినట్లు అనిపించినా కూడా అది మళ్ళీ వస్తూనే ఉంటుంది. దీనిని శాశ్వతంగా తొలగించుకోవడానికి కలబంద మంచి ఔషధంగా పనిచేస్తుంది అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కలబంద లో యాంటి డాండ్రఫ్ గుణాలు ఎక్కువ ఉన్నాయి. అవి చుండ్రు నివారణ కోసం ఉపయోగపడుతాయి.

వెంట్రుకల ఎదుగుదల:
చాలా మంది వెంట్రుకలు పెరగట్లేవని బాధపడుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా ఏన్ని ఆయిల్స్ మార్చిన ఏలాంటి ఉపయోగం ఉండదు. అలాంటి వారు బాధపడే అవసరం లేకుండా కలబంద గుజ్జును తీసుకొని అందులో రెండు స్పూన్ లా ఆమూదం నూనెను కలిపి తలకు పట్టించి మంచిగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసి ఒక గంట సేపు వదిలేసాక నార్మల్ నీటితో కడిగేయండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చాలు కొన్ని రోజులకు వెంట్రుకల కుదుళ్లు గట్టి పడి వెంట్రుకలు పెరుగుతాయి. అంతేకాదు కలబంద వెంట్రుకలకు ఒక మంచి కండీషనర్ గా కూడా ఉపయోగపడుతుంది.

3.జీర్ణ వ్యవస్థ:
కలబంద జీర్ణ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు కలబంద లో యాంటి అసిడిటి గుణాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవి అసిడిటీ సమస్యని దూరం చేస్తాయి. కలబంద ని ఎవరైతే అసిడిటీ తో బాధపడుతున్నారో వారు ఉదయం లేవగానే కలబంద రసం తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు సంబంధిన సమస్యలు అన్నీ తొలగించుకోవచ్చు. అంతే కాదు కలబంద కడుపులోని నులీ పురుగులను కూడా చంపుతుంది.

4.క్యాన్సర్ :
క్యాన్సర్ తో బాధపడుతున్న వారు రోజు ఉదయం లేవగానే కలబందని జ్యూస్ రూపంలో తీసుకుంటే క్యాన్సర్ తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఎందుకంటే కలబంద లో యాంటి కాన్సర్ గుణాలు ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది.


5.బరువు మరియు కొవ్వు తరుగుదల:

ఉబాకాయ సమస్యతో చాలా మంది సతమతమవుతుంటారు. బరువు తగ్గడానికి డైట్ మరియు జిమ్ చేసిన అంత త్వరగా అస్సలు తగ్గరు.కలబంద బరువు తగ్గడానికి కొవ్వుని కరిగించి స్లిమ్ అండ్ ఫిట్ గా మరియు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

6.నోటి దుర్వాస సమస్య :
నోటి దుర్వాస తో బాధపడేవారు కలబంద ని రోజు ఉదయం పూట తీసుకుంటే నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. అంతేకాకుండా నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది. పూర్వకాలంలో చాలా మంది కలబందను టూత్ పేస్ట్ లా కూడా వాడేవారు.

7.మోకాలి నొప్పులకు :
కలబంద గుజ్జును తీసి పేస్ట్ లా చేసి మోకాలి నొప్పి ఉన్నచోట అప్లై చేయాలి. ఇలా చేయడం వల్లన మోకాలి నొప్పులు తగ్గిపోతాయి.

    RELATED ARTICLES
    LATEST ARTICLES