ఆరెంజ్ జ్యూస్ ఉపయోగాలు (orange juice benefits):
1.ఆరెంజ్ జ్యూస్ (orange juice benefits) శరీరం పెరుగుదలకు, జీవక్రియలు చురుగ్గా పనిచేయడానికి, బిపిని తగ్గించుకోవడానికి పొటాషియం ఎంతో అవసరం. ఈ పొటాషియం మీడియం సైజు ఆరెంజ్‌లో 260 మిల్లీగ్రాములు వరకు ఉంటుంది. ఇక ఫైబర్ శాతం చెప్పాల్సిన పని లేదు. కేవలం ఆరోగ్యానికి మాత్రమేకాదు.. మంచి శరీరఛాయ కోసం కూడా ఆరెంజ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వయసును మీద పడనివ్వదు.
2.ఆరెంజ్ జ్యూస్ లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే హెస్పరిడిన్.. క్యాన్సర్ కణతులు ఏర్పడకుండా నివారిస్తుంది.అర్ధరైటీస్ వ్యాధి కూడా నివారిస్తుంది.
3.కిడ్నీలు స్వేచ్ఛగా పనిచేయడానికి బాగాసహకరిస్తుంది. విటమిన్ ఏ కంటి చూపును పెంచడంతో దోహద పడుతుంది. రేచీకటి రాకుండా కాపాడుతుంది.హెస్పరిడిన రక్తపోటునునియంత్రిస్తుంది. హై కొలెస్ట్రాల్‌ని నివారించి రక్తం ఫ్రీగా కదిలేందుకు సహాయపడుతుంది.
4.నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన జీర్ణశక్తి వ్రుద్ధి చెందుతుంది . కావున శరీర వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.శరీరంలో సెరొటిన్, ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ధం చేసే ఇనోసిటాల్ అనే పదార్థం నారింజలో ఉంది. మానసిక స్థితిని ప్రశాం తంగా ఉంచుతుంది. క్రుంగుబాటు నుంచి ఉపశమ నాన్నిస్తుంది.
5.కొవ్వుపదార్థాలను కరిగించడంలో, రక్తంలో కొవ్వును తగ్గించడంలో తోడ్పడుతుంది. మధుమేహ వ్యాధి ఉన్నవారునారింజ పండు ను తినవచ్చును. వేసవికాలములో నారింజ రసముత్రాగితే వేసవి తాపము నుండిబయటపడవచ్చును.