Cucumber benefits :
చవకాగా సామాన్యులకు కూడా అంత్యంత ఆరోగ్యాన్ని అందించెది కీరదోసకాయ(cucumber benefits). మనచుట్టు ఇంత విలువైన శరీరానికి కావలసిన మంచి కనిజ లవనాలు కలిగిన ఆహారం కీరదోసకాయ. చాలామంది సలాడ్స్ మరియు జ్యూస్ ల రూపంలో తీసుకున్నారు. డాక్టర్లు మరియు శాస్త్రవేత్తలు కూడా కీరదోసకాయ ఒక పోశకాహార వనరు అని పరిగణించారు. కీరదోసకాయలో విటమిన్ ‘ఎ’ మరియు ‘బి’ ఇంక ‘సి’ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ‘బి’ ఉండటం వలన ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.
కీరదోసకాయలో 95% నీరు ఉంటుంది. కాలానికి సంబంధం లేకుండ ఎకాలంలో అయిన నిర్మొహమాటంగా గా తీసుకోవాల్సిన ఆహరం కీరదోసకాయ. కీరదోసకాయలో పొటాషియం, సిలికాన్,మాంగనిష్, మెగ్నీషియం, పాస్పరస్, ఫైబర్లు సమృద్ధిగా లభిస్తాయి. కీరదోసకాయని పోషకాల వనరు అనవచ్చును. కీరదోసకాయ తినడం వలన శరీరానికి చలువ చేస్తుంది. కీరదోసకాయ శరీర బరువు తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
కీరదోసకాయ శరీరాన్ని ఎల్లపుడు హైడ్రేటెడ్ గా, కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. చర్మవ్యాధులు రాకుండా కూడా కీరదోసకాయ సహాయపడుతుంది. తలనొప్పి తగించడంలో కీరదోసకాయ చాలా ఉపయోగపడుతుంది. కీరదోసకాయ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. పాంక్రియస్ సరిగా పనిచేయని మధుమేహం వ్యాధి ఉన్న వారు కూడా రోజు తినవచ్చును. కీరదోసకాయ క్యాన్సర్ రాకుండా ఉపయోగపడుతుంది. కీరదోసకాయను ముక్కలుగా చేసి కoటిరెప్పల పైన పెట్టడం వలన కళ్ళచుట్టు ఉన్న నల్లటి వలయాలు పోయేలా చేసి కళ్ళకు అలసట తగ్గిస్తాయి మరియు కళ్ల చుట్టు ఉండే ఉబ్బు తగ్గుతుంది.
సూర్యుడి నుండి వెలువడే అతినిలలోహిత కిరనాల నుండి కాపాడుతుంది. వేసవిలో వీలయినంత ఎక్కువగా కీరదోసకాయని తీసుకోవాలి. కీరదోసకాయ పొట్టులొ విటమిన్ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. అందువలన పొట్టు ఉండగా తినడం చాలా మంచిది ఆరోగ్యానికి. రిచ్ డైట్ లో కీరదోసకాయ చాలా ముఖ్యమైనది.కీరదోసకాయ మెదడులోని ఉండే న్యురాన్స్ నీ చురుకుగా పనిచేసేలా తోడ్పడతుంది. కీరదోసకాయ రసం తీసి మొహాన్ని తుడుచుకోవడం వల్ల మొహం మీద ఉన్న మురికి తొలిగిపోవడంతో పాటుగా మొహం కాంతివంతంగా మారుతుంది.
కీరదోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన వేసవిలో వడదెబ్బ బారి నుండి కాపాడుకోవడానికి జ్యూస్ లేదా కాయని తీసుకోవచ్చు. కీరదోసకాయని తీనేముందు మంచిగా శుభ్రంగా మంచినీటి తో కడగాలి ఎందుకంటే ఈ కాలంలో అన్ని రసాయనిక ఎరువులు వాడి పండిస్తున్నారు . మధ్యాహనబోజనం సమయంలో రాత్రిబోజనం గా తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.