Wednesday, May 18, 2022
HomeHealthBest Liver health tips in telugu : లివర్ హెల్త్ టిప్స్

Best Liver health tips in telugu : లివర్ హెల్త్ టిప్స్

Liver health tips in telugu :

మనిషి అవయవాలలో ముఖ్యమైనది లివర్ (liver ). ఇది శరీరంలో పెద్ద అవయవం కూడా అందుకే ఈ లివర్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చిన వాటిని మనం ఏలా ఎదురుకోవాలి. అనేది మనం తెలుసుకోవాలి. రోజు మనం తీసుకునే కల్తీ ఆహారం లేదా మెడిసిన్స్ వల్ల కూడా లివర్ పాడై పొయే ప్రమాదం ఉంది. అందుకు ఈ పోస్ట్ చదవండి అందులో కొన్ని టిప్స్ (Liver health tips ) మీకు ఉపయోగపడచ్చు…

టిప్స్ తెలుసుకొనే ముందు మనం కొన్ని లివర్ కి వచ్చే ప్రాబ్లమ్స్ ని వాటి వలన మన శరీరంలో జరిగే మార్పులను ఇబ్బందులను తెలుసుకుందాం. లివర్ కి కలిగే వ్యాధిలలో ఎక్కువ వచ్చేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటి లివర్ వ్యాధి మరియు హెపాటైటిస్ ‘బి’ హెపాటైటిస్’సి’ మొదలగునవి.లివర్ కి ప్రాబ్లమ్ వచ్చినపుడు కళ్ళు పసుపు రంగులో మారడం మరియు చర్మం పసుపు రంగులో మారడం. కడుపు భాగం ఉబ్బడం కాళ్ళు వాపు రావడం. ఒక్కొక వ్యక్తి కి ఒక్కో లక్షణాలు ఉండచ్చు. కొందరిలో ఏ లక్షణం లేకుండా కూడా లివర్ వ్యాధి చాప కింద నీరులా వ్యాపించచ్చు.

లివర్ కి వచ్చే వ్యాదులను నిర్మూలించేందుకు కొన్ని ఆహారపు అలవాట్లు మరియు టిప్స్ పాటిస్తే చాలు అవేంటో తెలుసుకుందాం.


1.లివర్ ఆరోగ్యం కోసం ముందుగా ఒక గుప్పెడు ఎండు ద్రాక్షలను తీసుకోండి మరియు ఒక నాలుగు వందల ఏం ఎల్ ల నీటిని తీసుకోండి. ముందు రోజు రాత్రి మొత్తం ఎండు ద్రాక్ష ని నీటిలో నానపెట్టాలి. మరుసటి రోజు ఉదయం లేవగానే వాటిని వేడి చేయాలి. 5 నిమిషాల తరువాత వేడి తగ్గి కాస్త వేడిగా ఉన్నప్పుడు ద్రాక్ష ని తింటూ నీటిని తాగాలి. ఇలా చేయడం వలన ఫ్యాట్టి లివర్ వ్యాది నుండి బయటపడచ్చు.


2.ముందుగా ఒక టీ స్పూన్ జాజికాయ(nutmeg) పొడిని మరియు ఒక ఆఫ్ టీ స్పూన్ పసుపు ,ఆఫ్ టీ స్పూన్ దాల్చినచెక్క మరియు ఆఫ్ టీ స్పూన్ అల్లమ్ పౌడర్, ఆఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని ఒక గ్లాస్ నీటిని తోసుకోవాలి. అన్నిటిని నీటిలో కలిపి వేడి చేయాలి. వేడి అయినా నీటిని వడగట్టి గోరువెచ్చగా ఉన్నపుడు తాగాలి.ఇలా తాగడం వలన లివర్కి పట్టిన మలినాలు తొలిగిపోతాయి.


3.మన లివర్ కి వచ్చే ఏ అనారోగ్యం ఆయన మన ఆహారపు అలవాట్లు మరియు మన జీవన విధానం పై ఆధారపడి ఉంటుంది. ముందుగా మన ఆహారపు అలవాట్లు సరిగా చూసుకోవాలి. మన ఆహారంలో ఎక్కువ వెజిటబుల్స్ మరియు పండ్లు తినాలి. చెడు ఫ్యాట్ కి దూరంగా ఉండాలి. ఎక్కువ వాటర్ తాగాలి. రోజుకి 45 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఇలా ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే లివర్ ప్రాబ్లమ్స్ ఏ కాదు అలాంటి అనారోగ్యం మీ దరికి రాకుండా ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments