Best tips to control diabetes level :
ఈ మధ్య ప్రపంచంలో అందరిని భయాందోళనకు గురి చేసే అత్యధిక భయంకరమైన వ్యాధిలో ఒకటి మధుమేహం. ఈ మధుమేహం మనం ప్రపంచంలో ప్రతి పదిమంది లో ఒక వ్యక్తి కి మధుమేహం తో బాధపడుతున్నారు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో మందులు వచ్చిన కూడా ఇప్పటికి పూర్తిగా నియంత్రణకు అలాంటి మందులు లేవు. కానీ మధుమేహం అదుపులో ఉంచడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. కాబట్టి ఇప్పుడు మనం ఆ చిట్కాలు తెలుసుకుందాం.(diabetes control tips)
1.మనకు తెలిసిన కొన్ని ఆహార పదార్థాలతో మధుమేహన్నీ అదుపు చేసుకోవచ్చు. అందులో ఒకటి కాకరకాయ కాకరకాయలో పోలిపేపటౌడ్ ఉంటుంది ఇది మధుమేహాన్ని అదుపు చేసుకోవడానికి సహాయపడుతుంది. తరువాత మనం వంటిట్లో ఉపయోగించేది దాల్చినచెక్క ఈ దాల్చిన చెక్కను ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక రాత్రి మొత్తం నానపెట్టాలి ఆ నీటిని మరుసటి రోజు ఉదయాన్నే తాగడం వలన మధుమేహం అదుపు చేసుకోవచ్చు. ఆకు కూరలు మరియు నట్స్( బాదం,పల్లిలు, వాల్నాట్స్,జీడిపప్పు,మొదలగునవి). ఆకు కూరలు, వెజిటబుల్స్ మరియు నట్స్ లో అధిక ఫైబర్ మరియు తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండడంతో మధుమేహాన్ని అదుపులో ఉండేలా చూసుకోవచ్చు.
2.ఆహార పదార్థాలతో కాకుండా యోగ అసనాలతో మరియు వ్యాయామాలతో కూడా మధుమేహాన్ని అదుపు చేసుకోవచ్చు. అలాగే ప్రతి రోజు ఉదయాన్నే 45 నిమిషాలు నడవడం వలన కూడా మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
3.అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఆహారం తీసుకొనే విధానం. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారాన్ని తీసుకోకూడదు. మరియు మన పొట్ట నిండుగా ఆహారాన్ని తీసుకోకూడదు.ఎప్పుడు కానీ ఆహారాన్ని కొద్దీ కొద్దిగా తీసికోవడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకోవాలి. ఇలా చేయడం వలన మనం ఎంతో ఈజీగా మధుమేహాన్ని అదుపు చేసుకోవచ్చు.మధుమేహం ఉన్న వారు మాంసాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలని వారానికి 100 గ్రాముల మాంసం తీసుకుంటే చాలు ఎక్కువ మాసం తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు.
4.మధుమేహం ఉన్న వారు కోడి గుడ్డు పైన ఉన్న తెల్ల దాన్ని తీసుకోవాలి లోపల ఉన్న పసుపు రంగు దానిని తీసుకోకూడదు ఎందుకంటే అందులో ఎక్కువ ప్రొటీన్ వుంటుంది కాబట్టి ఇలాంటి కొన్ని ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకోవడం వలన మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు.