Natural Home Remedies for Dark Neck :
ఈ కాలంలో మనం అందరిలో చూసేది మెడ భాగంలో నలుపుగా ఉండడం (Dark Neck ).ఈ నలుపును పోగొట్టాదానికి చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరికి కూడా సరైన ఫలితం లేదు. ఎందుకంటే వాళ్లు ప్రయత్నించే ఇంటి చిట్కాలు కేవలం కొంత మాత్రమే ఫలితాన్ని చూపిస్తాయి. కానీ మొత్తం నలుపును పోగొట్టాడానికి నా దగ్గర కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.
మొదటగా మూడు టీ స్పూన్ల తేనె ని ఒక బౌల్లో తీసుకోండి మరియు రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసుకొని రెండిటిని చక్కగా కలపండి అది పేస్ట్ లా అవుతుంది అప్పుడు ఆ పేస్ట్‌ని మెడ పై భాగంలోని నల్లటి ప్రదేశములో పెట్టాలి. పెట్టక 5 నిమిషాలు ఆరానివ్వాలి ఇలా ఆరిన తరువాత చల్లటి నీటితో కడగాలి ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉండాలి. అప్పుడు మీ మెడ అందంగా తెల్లగా అవుతుంది.
2.ముందుగా ఒక బంగాళదుంప తీసుకోండి. దాన్ని తురిమి అందులో నుండి రసాన్ని తీయాలి. ఆ వచ్చిన రసాన్ని ఎక్కడైతే మెడ మీద నలుపు ఉందో అక్కడ రాయండి. ఒక 5 నిమిషాలు ఆగి చల్లటి నీటితో కడగాలి.
3.మొదట ఒక గిన్నెలో మూడు టీ స్పూన్లు శనిగపిండి తీసుకోండి. అందులో కొంచం పసుపుని వేసి వేయండి. అందులో సరిపడు నీళ్లు వేసి మెత్తని పేస్ట్ ల చేసుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని మెడ భాగంలో నల్లగా ఉన్న చోట పెట్టాలి. అలా పెట్టిన తర్వాత అది కొంత సమయానికి ఆరి పోతుంది. ఆరిన దాన్ని చల్లని నీటితో కడగాలి.
ఒక బౌల్లో కొంచం పసుపు ఒక టీ స్పూన్ నిమ్మకాయ రసం కలిపి మెడపైన మర్దనా చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడంతో మీ మెడ పైన నలుపు తగ్గుతుంది.
5.ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని దాని పైన వంట సోడా ని వేసి మెడ చుట్టూ స్కర్బ్ చేసుకోవాలి.
ఒకవేళ మీకు ఈ చిట్కాలు పని చేయకపోతే అందుకు కారణం మీ హార్మోన్లు ఎక్కువ తక్కువ కావడం వలన అయ్యుండచ్చు. ముందుగా మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి. రోజు వ్యాయామం చేయాలి. ఇలా మంచి ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం వలన మీ శరీరంలో అన్ని హార్మోన్లు సరిగా విడుదల అయ్యి ఆరోగ్యాంగా ఉండటంతో మీకు మెడ భాగంలో నలుపు రాకుండా చేయచ్చు.